ఓ మహాత్మా..ఓ మహర్షి - వెంటాడే జ్ఞాపకం పదిలం
శాంతికి..అహింసకు పర్యాయ పదం మహాత్ముడు. ఇండియా అంటేనే గాంధీ. గాంధీ అంటేనే భారతదేశం. ఒకే ఒక్కడు కోట్లాది జనానికి ఆరాధ్య దైవంగా..స్ఫూర్తి నింపుతూనే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆయనను అనుసరిస్తున్న వాళ్లు ఉన్నారు. హింసకు వ్యతిరేకంగా జరిగే ప్రతి పోరాటానికి గాంధీ ఓ సింబల్. ఓ ఐకాన్. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ఈ అరుదైన మానవుడు ..వ్యవస్థగా ఎదిగి..అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన ఇండియాకు ఆంగ్లేయుల నుండి విముక్తి కలిగించిన అహింస అనే ఆయుధాన్ని మనకిచ్చిన గాంధీ. ఎం.కె. గాంధీ ..అంటేనే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ.
ఈ పేరు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. సూర్య చంద్రులు ఉన్నంత దాకా ఆయన జీవితపు వెలుగులు ప్రసరిస్తూనే ఉంటాయి. మహాత్ముని జీవితమే ఓ సందేశం. చరఖా అన్నా..నడవాలన్నా..శాంతియుతంగా ఉండాలంటే గాంధీని తలుచు కోవాల్సిందే. మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్ ..గాంధీ రాసిన ఆత్మకథ ..ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించబడి ఉన్నది. ఈ దేశంలో ఎక్కడికి వెళ్లినా..ఏ ఊరుకు వెళ్లినా సరే మహాత్ముడి విగ్రహంతో పాటు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. వీరిద్దరు ఈ జాతికి వెలుగు దివ్వెలు. స్ఫూర్తి ప్రదాతలు.
గాంధీ జీవితమే ఓ సందేశం. ఆయన చేతిలో ఎప్పుడూ భగవద్గీత ఉండేది. అదెప్పుడూ ఆయనను తనను తాను తెలుసుకునేలా తీర్చిదిద్దింది. ప్రతి ఒక్కరికి ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. అదెప్పుడూ హెచ్చరిస్తూనే ..పక్కదారి పట్టకుండా చేస్తుంది. పలు దేశాధిపతులను..పలు రంగాల్లో నిష్ణాతులు, మేధావులు, ఆటగాళ్లు, కంపెనీల అధిపతులు, సినీ దిగ్గజాలు, సిఇఓలు, ఛైర్మన్లు, ఇంజనీర్లు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, వ్యాపారవేత్తలు..
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు గాంధీజిని ఆదర్శంగా తీసుకున్న వాళ్లే. ఆయన బోధనలు, ప్రసంగాలు, మాటలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. అలాంటి గాంధీ జీవన ప్రయాణంలో ఎన్నో మలుపులు ..మజిలీలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఇలాంటి ఓ వ్యక్తి బతికారంటే నమ్మలేం. రాబోయే తరాలు విస్తుపోతాయి. విస్మయానికి గురవుతాయి. జాతి యావత్తు ప్రేమగా ..గౌరవంంగా పిలుచుకునే బాపు. ఆయన జీవన ప్రయాణంలో మరిచి పోలేని ఛాయా చిత్రాలు ఎప్పటికీ గుర్తుండి పోయాయి. అవి ప్రత్యేకంగా మీ కోసం.
దక్షిణాఫ్రికాలో బారిస్టర్ చదువు కోసం బయలుదేరినప్పుడు 1908లో దిగిన అరుదైన ఫోటో దిగారు. అది ఇప్పటికీ ఎందరినో ఆకట్టుకుంటోంది. 1915లో మద్రాసులో స్కౌట్ బాయ్స్‌ను ఉద్ధేశించి మహాత్మా గాంధీ ప్రసంగించారు. ఆ ఫోటో పాపులర్ అయింది. 1924లో జైలు నుండి విడుదలయ్యాక తిరిగి తన ఇంటికి వచ్చారు. అక్కడ ఒక్కరే చదువుకుంటూ..రాసుకుంటూ ఉండి పోయారు. అప్పుడు తీసిన ఫోటో ఇప్పటికీ చదివే వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది.
1925 జూన్ 9న ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో గాంధీ అరుదుగా దర్శనమిచ్చారు. నూలు నుడుకుతూ మహాత్ముడు కనపించే దృశ్యం అలరిస్తుంది.
1925 జూన్ 9న ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో గాంధీ అరుదుగా దర్శనమిచ్చారు. నూలు నుడుకుతూ మహాత్ముడు కనపించే దృశ్యం అలరిస్తుంది.
లండన్‌లో 1931 సెప్టెంబర్ 22న తూర్పు లండన్ నగరంలో గాంధీ ప్రవేశించారు. ఆ సమయంలో ఆయనను చూసేందుకు అక్కడి జనం ఎగబడ్డారు. ఆ ఛాయా చిత్రంకు విపరీతమైన ఆదరణ లభించింది. అదే సమయంలో అదే నగరంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ వెళ్లే సన్నివేశం అరుదైనది. అదే ఏడాది డిసెంబర్ నెలలో లండన్‌లో కొందరి పిల్లలతో మహాత్ముడు కలిసి దిగారు. ఆయనకు పిల్లలంటే పంచ ప్రాణం. జనవరి నెలలో లాంక్‌షైర్ నగరాన్ని సందర్శించిన సందర్భంలో చేనేత కార్మికులను కలుసుకున్నారు. ఆ ఫోటో కూడా ఆకట్టు కోవడం ఖాయం.
1889లో ముంబయిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ మీటింగ్ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ..గాంధీ కలిసి చర్చిస్తున్న ఫోటో కు జనం ఓటు వేశారు. 1933లో గుజరాత్‌లో గాంధీ నిరాహారదీక్ష చేపట్టిప్పుడు, 1938లో కోల్‌కతాలోని ప్రిసిడెన్సీ చెరసాల నుండి విడుదలైన సందర్భంగా వస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. లార్డ్ వై స్రాయ్‌ను కలిసేందుకు 1939లో ఢిల్లీకి కాలినడకన బయలుదేరి వచ్చారు. ఆ సన్నివేశం ఇప్పటికీ ఇండియన్స్‌ను ఆకట్టుకుంటుంది. వైస్రాయ్ హోటల్‌లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అధినేత జిన్నాను గాంధీ కలిశారు. రైలులో ప్రయాణం చేస్తూ డొనేషన్లు స్వీకరిస్తున్న గాంధీ ఫోటో ఇప్పటికీ ఇంపాక్ట్ కలుగ చేస్తుంది.
ముంబై నగరంలో అనుచరులు, అభిమానులతో కలిసి నడుస్తున్నప్పటి చిత్రం ఎప్పటికీ మరిచి పోని జ్ఞాపకంగా మిగిలి పోతుంది. అందుకే ఆయన మహాత్ముడయ్యారు..మనం మనుషులుగా ఇలా మిగిలేం కద

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి