డాలర్లు కొల్లగొడుతున్న ఐడియాలు - స్టార్టప్ లలో మనమే టాప్

కలలు సాకారమవుతున్నాయి . అసాధ్యమనుకున్నవన్నీ సాధ్యమవుతున్నాయి . టెక్నాలజీ తెచ్చిన మార్పులు ..ప్రపంచీకరణ పుణ్యమా అంటూ లోకమంతటా లెక్కలేనన్ని అవకాశాలు లభిస్తున్నాయి . ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభ మైన స్టార్టప్ లలో ఇండియా రెండో స్థానంలో నిలిచింది . ఇదో రికార్డ్ గా భావించాలి . ప్రతి ఒక్కరికి కలలు వస్తూనే ఉంటాయి ఎడతెరిపి లేకుండా . వీటిని సాకారం చేసుకోవాలంటే ..అవి ఆచరణ లోకి రావాలంటే ..ఓ ప్లాన్ ఉండాలి . ఎలా సమాజానికి అప్ప్లై చేయాలో తెలుసు కోవాలి . స్టార్ట్ చేస్తేనే సక్సెస్ వస్తుందనుకుంటే పప్పులో కాలు వేసినట్టే . దీనికి సాధన చేయాలి . మెంటార్స్ ను సంప్రదించాలి . అది ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో తెలియ చెప్పాలి . ఐడియాకు ప్రాణం పోయాలంటే మార్కెట్ ను స్టడీ చేయాలి . ఇవ్వాళ ప్రపంచ మార్కెట్ ను శాశిస్తున్న అన్ని సామాజిక మాధ్యమాలన్ని ఒకప్పుడు చిన్న గదుల్లో రూపు దిద్దుకున్నవే. ఈ మధ్య భారత్ ఇలాంటి క్రియేటివిటీ కలిగిన కుర్రాళ్ళు ..అమ్మాయిలు దుమ్ము రేపుతున్నారు . వీళ్ళు మరొకరి కింద పని చేసేందుకు ఒప్పుకోవడం లేదు . ఏదైనా సరే ..ఎంత కష్టం వచ్చినా సరే ఒంటరిగానే స్టార్ట్ అప్ ప్రారంభించేందుకే మొగ్గు చూపిస్...