మిస్టర్ కూల్‌కు 38 ఏళ్లు - ధోనీ ఇలాగే వర్ధిల్లు..!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మిస్టర్ కూల్ క్రికెటర్‌గా పేరు సంపాదించుకున్న ఇండియన్ క్రికెటర్ , మాజీ భారత క్రికెట్ జట్టు రథసారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఇపుడు 38 ఏళ్లు నిండాయి. భారత్‌కు కపిల్‌దేవ్ సారథ్యం తర్వాత ధోనీ నేతృత్వంలో ఇండియాకు ప్రపంచ కప్ దక్కింది. ఆయన ఇప్పుడు మరో ప్రపంచ కప్ టోర్నీలో ఆడుతున్నాడు. ఇదే ఆఖరు టోర్నీ కావచ్చు తన కెరీర్‌లో. అటు బ్యాటింగ్ లో ఇటు కీపింగ్‌లో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్న ఈ ఆటగాడు ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. కూల్‌గా, ప్రశాంతంగా ఎలాంటి వత్తిళ్లలోనైనా సరే జట్టును విజయ తీరాలకు చేర్చడంలో ధోనీని మించిన నాయకుడు లేడు..ఆటగాళ్లు దరిదాపుల్లో లేరంటే అతిశయోక్తి కాదేమో. 1981 జూలై 7న ఒకప్పటి బీహార్ రాష్ట్రం..ఇపుడు ఝార్ఖండ్ స్టేట్‌లో ఉన్న రాంచీలో జన్మించారు. ఆయనకు మిస్టర్ కూల్‌గా, మహిగా, తాలా పేర్లున్నాయి. ఎడమ చేతి బ్యాట్స్ మెన్ గా సక్సెస్ అయ్యారు. అలాగే కీపర్‌గా కూడా రాణించారు. 2005 డిసెంబర్ 2న శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్ ఆరంగ్రేటం చేశాడు. 2004 డిసెంబర్ 23న బంగ్లాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఎంటర్ అయ్యా...