ఆర్థిక రంగం అస్తవ్యస్తం

భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఇపుడు నడిసంద్రంలో కొట్టుమిట్టాడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ మార్కెట్‌ను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చైనాలో స్టార్ట్ అయిన ఈ వైరస్ వల్ల అనేక దేశాలు అల్లాడి పోతున్నాయి. నష్ట నివారణ చర్యలు చేపట్టినా కంట్రోల్ కాక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో లాక్ డౌన్ చేస్తున్నాయి. దీంతో ఉత్పత్తి, పారిశ్రామిక రంగాలన్నీ క్లోజ్ కావడంతో ప్రపంచ మానవాళి మనుగడకు మరింత ప్రమాదం ఏర్పడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా వైరస్‌ను కట్టడి చేయలేక పోతోంది. నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన ప్రెసిడెంట్ ట్రంప్ దీని పట్ల కొంత ఉదాసీన వైఖరిని అవలంభిస్తూ వచ్చారు. ఇది మరింత పెను ప్రమాదంగా పరిణమించింది. దీంతో ఆలస్యంగా మేల్కొన్న ప్రెసిడెంట్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కరోనా కంట్రోల్ చేసేందుకు ట్రిలియన్ డాలర్లను ప్రకటించారు. అంతకు ముందు ట్రంప్ చైనాను టార్గెట్ చేశారు. చైనా వల్లనే ఈ కరోనా మహమ్మారి దాపురించిందంటూ కారాలు మిరియాలు నూరారు. దీనికి తానేమీ తక్కువ తి...