బంగారు కొండ ..మన దేవరకొండ - మోస్ట్ డిజైరబుల్ మెన్

తెలంగాణ వెలిగి పోతోంది. నియాన్ లైట్ల మధ్యన చార్మినార్ మెరిసి పోతోంది. వజ్రాలు, వైఢూర్యాలు అమ్మిన భాగ్యనగరం తనను తాను గొప్పనైన నగరంగా భాసిల్లుతోంది. త్యాగాలకు, బలిదానాలకు , పోరాటాలకు , ఉద్యమాలకు , ఐటీ హబ్‌కు కేరాఫ్‌గా మారిన హైదరాబాద్ తన బ్రాండ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. నిన్నటి దాకా తెలుగు సినిమా కొందరి చేతుల్లోనే..ఇపుడు అది అందరిది. టాలెంట్ ఎక్కడుంటే అక్కడికి పరుగులు తీస్తోంది పరిశ్రమ. కేవలం కొన్ని సినిమాల్లోనే నటించి..తన డిఫరెంట్ మేనరిజంతో ఆకట్టుకుంటూ ..తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును..బ్రాండ్ ను స్వంతం చేసుకున్న ఘనత ఒక్క విజయ్ దేవరకొండకే దక్కింది. ఇపుడు తెలంగాణ అతడిని చూసి గర్వపడుతున్నది. ఒకే ఒక్క సినిమా అతడిలోని ప్రతిభను..హీరోయిజాన్ని ప్రదర్శించేలా చేసింది. అర్జున్ రెడ్డి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. విజయ్ దేవరకొండ కాస్తా అర్జున్ రెడ్డిగా మారి పోయాడు. అంతలా యూత్ తో కనెక్ట్ అయ్యాడు. అతడి రేంజ్ అగ్ర హీరోల సరసన చేరింది. ఇటీవల మహేష్ బాబు తన మహర్షి సినిమా రిలీజ్ ఫంక్షన్ కు ప్...