ప్రేమా కవ్వించనీ..మనసా రవళించనీ

తెర మీద పాత్రలు మార్చినంత ఈజీగా ప్రేమికులు మారిపోతున్నారు. ప్రేమంటే రెండు గుండెల చప్పుడు. రెండు మనసుల మౌనం. ఒకరి కళ్లళ్లలోకి ఇంకొకరు చూసుకుంటూ ..లోకానికి ఆవల హృదయాలతో మాట్లాడుకోవడం. ప్రేమంటే ఏమిటంటే ..ప్రేమించాక తెలిసే అంటూ సినీ కవి రాసినా..ప్రేమ ఒక మధురమైన భావన. అనితర సాధ్యమైన ఆలోచన. అదొక్కటే మనలోకి చేరిపోతే..జీవితం కొత్తగా అనిపిస్తుంది. గుండెల్లో ఏదో కెలుతున్నట్లు..గాల్లో తేలిపోతున్నట్లు..మనసంతా దూది పింజెల్లా మారిపోతున్నట్లు..పక్షుల్లా గాల్లో ఎగురుతున్నట్లు అనిపిస్తుంటంది. ఇది సహజాతి సహజం కూడా. సామాన్యుల నుండి కోట్లున్న సంపన్నుల దాకా అందరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడ్డ వారే..పడిపోయిన వారే. ప్రేమకున్న శక్తి అలాంటిది. ప్రేమ అన్నది ఓ దీపం లాంటిది. దానికి ఎప్పటికప్పుడు ఆత్మీయత అనే నూనె పోస్తూనే ఉండాలి. అది వెలుగుతూనే ఉంటుంది. లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కొన్ని ఫాంటసీస్ వుంటాయి. అవన్నీ జరగాలని లేదు. కొన్నిసార్లు ఈ ఆలోచనలు ఇలాగే వుండిపోతే బావుండునని అనిపిస్తుంటుంది. ఏం చేస్తాం. ఇవాళ ప్రేమంటే వ్యాపారం అయి ...