సివిల్స్‌లో మెరిసిన మట్టి బిడ్డలు - సత్తా చాటిన పల్లె పరిమళాలు - సివిల్స్ ట్రైనింగ్ హబ్‌గా హైదరాబాద్

దేశంలో అత్యుత్తమమైన సర్వీసుగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పేదింటి బిడ్డలు తమ సత్తా చాటారు. తెలుగు వారు మరోసారి మెరిశారు. జాతీయ స్థాయిలో యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ ఫలితాలను వెల్లడించింది. తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన వరుణ్ రెడ్డి ఏకంగా ఏడవ ర్యాంకు సాధించి ఆశ్చర్యపోయేలా చేశాడు. టాప్ పరంగా 100 ర్యాంకులను ప్రకటిస్తే అందులో తెలుగు వారు ఆరు మంది ఉండడం విశేషం. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన వారే తమ సత్తా ఏమిటో ప్రదర్శించారు. సివిల్ సర్వీసెస్ లో అత్యుత్తమమైన ఫలితాలు ఇక్కడి వారే పొందుతున్నారు. సివిల్స్ కోచింగ్ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ మారింది. 2018లో నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి సెప్టెంబర్, అక్టోబర్ లో సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటర్వ్యూలు చేపట్టింది. ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటించింది. మొత్తంగా చూస్తే 759 మంది ఈ సర్వీసుకు ఎంపిక చేసింది యుపీఎస్సీ. జనరల్ కేటగిరిలో 361 మంది, ఓబీసీ కేటగిరిలో 209 మంది, ఎస్సీ కేటగిరిలో 128 మంది, ఎస్టీ కేటగిరిలో ...