పసిడి కోసం అతివల ఆరాటం..జోరు మీదున్న బంగారం

ఇండియన్ మార్కెట్ టోటల్లీ డిఫరెంట్. ఇక్కడ నమ్మకాలకు ప్రయారిటీ ఎక్కువ. మహిళలు ఉపవాసమైనా ఉంటారేమో కానీ బంగారం కనిపిస్తే చాలు కొనకుండా ఉండలేరు. అంతలా పసిడి వారి కుటుంబంలో భాగమై పోయింది. కనీసం గ్రామ బంగారమైనా సరే అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసేందుకు క్యూ కడతారు. నిన్నటి దాకా ఖాళీగా ఉన్న పసిడి దుకాణాలు ఇపుడు కళకళలాడుతున్నాయి. భారీ ఎత్తున మహిళలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్, తదితర నగరాల్లో గోల్డ్ షాపులు జిగేల్ మంటున్నాయి. 25 శాతం అమ్మకాలు పెరిగాయి. అక్షయ తృతీయ పుణ్యమా అంటూ నగల వ్యాపారులకు పంట పండుతోంది. ఎక్కువగా పసిడి కొనుగోలు చేయడంతో వీరికి బాగానే కలిసొచ్చింది. ప్రధాన నగరాల్లోని నగల దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు భారీగా పెరిగాయి. మరికొన్ని దుకాణాల్లో 40 శాతానికి పైగా అమ్మకాలు జరగడం చాలా మంది వ్యాపారస్తులను పునరాలోచనలో పడేసింది. గత రెండు నెలల కాలం నుండి బంగారం ధరల్లో మార్పు లేక పోవడం..రేటు స్థిరంగా ఉండడం వల్ల కొనుగోలుదారులు పసిడిని తీసుకు...