టాప్ కంపెనీల్లో ఫ్లిప్ కార్ట్ నెంబర్ వన్ - ఎంప్లాయర్స్ టాప్ ప్రయారిటి ఇదే

ప్రపంచ దిగ్గజ మార్కెట్ కంపెనీలన్నీ ఇండియాపైనే దృష్టి సారిస్తున్నాయి. వంద కోట్లకు పైగా ఉన్న జనాభాను టార్గెట్ చేశాయి. ఫ్రీ మార్కెట్ పుణ్యమా అని లెక్కలేనన్ని వస్తువులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఎక్కడలేనంత డిమాండ్ ఉండడంతో వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. కోట్లాది రూపాయల లావాదేవీలు కేవలం గృహోపకర వస్తువులపైనే జరుగుతున్నాయి. కంపెనీలకు లెక్కలేనంత లాభాలు సమకూర్చి పెడుతున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా పిల్లల వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. కస్టమర్లే దేవుళ్లు అంటూ ..జీఎస్టీ కూడా వీరి పైనే వేస్తూ..కంపెనీలు మాత్రం రుపీస్‌ను తమ గల్లా పెట్టెల్లోకి వేసుకుంటున్నాయి. మొత్తం మీద ఇండియన్స్ జేబులు మాత్రం గుల్లవుతున్నాయి. ఓ వైపు అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కంపెనీలు మార్పులు చేర్పులు చేస్తున్నాయి. మరింత ఆకట్టుకునేలా..ఆకర్షణీయంగా ఉండేలా కంపెనీలను రూపొందిస్తున్నాయి. వీటి కోసమే కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఈ కామర్స్ రంగంలో లక్ష కోట్ల వ్యాపారం జరుగుతోంది. వేలాది మందికి ఈ కంపెనీల్లో కొలువులు దక్కుతున్నాయి. ఇంకో...