అభివృద్ధి వైపే జనం - మళ్ళీ బాబుకే పట్టం - సర్వేలన్నీ అటు వైపే

సీన్ మారింది . ఏపీ రాజకీయాలు మరోసారి హీట్ పెంచినా మరోసారి చంద్ర బాబు నాయుడే సీఎం కాబోతున్నారంటూ పలు ముందస్తు సర్వేలు వెల్లడించాయి . మిషన్ చాణక్య తో పాటు వివిధ చానళ్ళు తమ సర్వేల ఫలితాలను ప్రకటించాయి . చాణక్య సంస్థ 101 సీట్లు టీడీపీకి రానున్నాయని ..మిగతా చానళ్ళు 105 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి . కొంత మేరకు వ్యతిరేకత ఉన్నా ఆంధ్రా జనం మాత్రం బాబు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అమలు చేస్తున్న పథకాలు . అభివృద్ధి ఇదే ముఖ ్యం కానున్న్నాయి . టిడిపికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్నది . ఏ సమయంలోనైనా కేంద్ర బిందువుగా మారే బాబు ఏది చేసినా ..ఓటమి మాత్రం ఒప్పుకోరు. ఆయన ఒక్కరే దేశం లో పీఎం మోడీని టార్గెట్ చేశారు . నిన్నటి దాకా కమలంతో దోస్తీ చేసిన బాబు ఈసారి ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు . చంద్రబాబును అటు మోడీ ఇటు కేసీఆర్ , జగన్, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు . అయినా బాబు చలించలేదు . ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నారు . బీజేపీయేతర పార్టీలు, నాయకులను ఒకే తాటిపైకి తీసుకు వస్తున్నారు . ఓ వైపు ఏపీలో ఎన్నికలకు సిద్దమవుతూనే దేశంలో పర్యటించారు . వారిని ఒకే చోటుకు తీసుకు వచ్చారు. కర్ణాకటలో దేవెగౌడ ..తమ...