ప్రపంచ చైతన్యపు గొంతుక..ప్రజా యుద్ధ నౌక - బాబ్ మార్లే ..!

యుద్ధాన్ని నిరసించినవాడు..ప్రజలను ప్రేమించిన వాడు. గుండెల్లో చైతన్య దీప్తులను వెలిగించిన మహోన్నత మానవుడు. బతికింది కొన్నేళ్లయినా కొన్ని తరాల పాటు వెంటాడేలా తన గాత్రాన్ని జనం కోసం అంకితం చేసిన ధీరోదాత్తుడు బాబ్ మార్లే. మోస్ట్ ఫేవరబుల్ సింగర్‌గా ..సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో కోట్లాది ప్రజలు వెతుకుతున్న సాంస్కృతిక యోధుడిగా ఆయన గుర్తుండి పోతాడు. అతడి కళ్లల్లో వేగం..అతడి చూపుల్లో ఆర్ద్రత..అతడి గొంతులో మార్మికత ..అతడి నడతలోని మానవత కలిస్తే అతడే బాబ్ . ప్రపంచాన్ని తన పాటలతో ఊపేసిన మొనగాడు. శాంతి కోసం పాటలు కట్టాడు. ప్రజల వైపు నిలబడ్డాడు. హింసకు వ్యతిరేకంగా ఎన్నో గీతాలు రాసి ఆలాపించాడు. ఏకంగా తానే ఓ పాటల సైన్యాన్ని తయారు చేశాడు. పుట్టుకతో జమైకన్ అయిన బాబ్..ఇపుడు పాటల పాలపుంత. చనిపోయి ..భౌతికంగా మన మధ్య లేక పోవచ్చు గాక..కానీ ఆయన సృజియించిన గాత్రపు మాధుర్యం ఇంకా..ఇంకా మోగుతూనే ఉన్నది. రాజ్య హింసకు పాల్పడే పాలకుల నుండి మార్కెట్ , కార్పొరేట్ శక్తుల కుయుక్తులు, మోసాలకు పాల్పడే వారి వెన్నులో తూటాలై పేలుతూనే ఉన్నాయి. చర...