పోస్ట్‌లు

ఏప్రిల్ 6, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అంత‌టా ప‌వ‌నిజం..అదే అత‌డి డైన‌మిజం

చిత్రం
పార్టీ న‌డ‌పాలంటే పైస‌లు అక్క‌ర్లేదు. కావాల్సంద‌ల్లా ప్ర‌జ‌ల‌ను ప్రేమించ‌డం..ఇంత స్ప‌ష్టంగా చెప్ప‌గ‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే ..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే చెప్పాలి. ఆర‌డుగుల బుల్లెట్ లాగా ఉంటాడు కానీ మాట‌లతో ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌గ‌ల‌డు. చూపుల‌తో జ‌నాన్ని మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల‌డు. ల‌క్ష‌లాది అడుగుల‌ను త‌న ఆశ‌య సాధ‌న కోసం..స‌మున్న‌త స‌మాజం కోసం న‌డిచేలా చేయ‌గ‌ల‌డు. ఇదీ కొణిదెలకు ఉన్న క్రెడిబిలిటి. వ్య‌క్తిత్వ ప‌రంగా అంత‌ర్ముఖుడైన ఈ ప‌వ‌ర్ స్టార్ గురించే ఇపుడంతా చ‌ర్చ‌. ఏపీలోను ఇటు తెలంగాణ‌లోను ఆయ‌న‌కు ఎన‌లేని అభిమానులున్నారు. త‌మ‌కు తాముగా ఆరాధించే వాళ్లు ఎక్కువున్నారు. ఇదే ఆయ‌న‌కు ఉన్న అతి పెద్ద అస్సెట్. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఎవ్వ‌రిపైనా చేయ‌రు. కాక‌పోతే త‌న జోలికి వ‌స్తే మాత్రం ఊరుకోరు. ఎక్కువ‌గా మాట్లాడ‌రు. కానీ మాట్లాడితే అవ‌త‌లి వాళ్లు ఫిదా అయి పోవాల్సిందే. ఇదే రాజ‌కీయ నాయ‌కుడికి ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ఒక్క చూపుతో..ఒకే ఒక్క మాట‌తో శాసించ‌గ‌ల‌రు. న‌డిపించ‌గ‌ల‌రు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టే ఏ రాజ‌కీయ పార్...