పోస్ట్‌లు

ఆగస్టు 7, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇండియాలో నెంబర్ వన్ .. ఆదాయంలో టాప్

చిత్రం
తెలుగమ్మాయి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సరికొత్త రికార్డ్ సృష్టించింది ..ఆటలో అనుకుంటే పొరపడినట్లే ..ఆటతో వచ్చిన ఆదాయంలో దేశంలోని మహిళా క్రీడాకారిణుల్లో సింధు టాప్ వన్ లో నిలిచారు. రికార్డ్ బ్రేక్ చేసారు . గతంలో టెన్నిస్ లో హైదరాబాద్ కు చెందిన సానియా మీరజా టాప్ లో ఉండేది ..ఇప్పుడు ఆమె ప్లేస్ ను సింధు ఆక్రమించింది. సింధు ఏడాది ఆదాయం ఏకంగా 39 కోట్ల రూపాయలుగా తేల్చింది ప్రముఖ సంస్థ ‘ఫోర్బ్స్‌’. ప్రతి ఏటా ఎవరెవరు ఎంతెంత సంపాదించారో లెక్కించి రేటింగ్ ఇవ్వడం పరిపాటి. ఈ సారి తెలుగమ్మాయి సింధు చోటు దక్కించుకుంది. ఒలింపిక్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌ సాధించింది. ఆటతో పాటు ఆర్జనలోనూ ఆమె వేగంగా దూసుకెళుతోంది. తాజాగా ‘ఫోర్బ్స్‌-2019 మహిళా అథ్లెట్ల’ జాబితాలోఇండియా నుంచి అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా 13వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఓ ఏడాదిలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న తొలి 15 మంది మహిళా అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం సింధు ఏడాదికి అక్షరాలా రూ. 39 కోట్లు పారితోషికంగా అందుకుంటోంది. సింధు మినహా భారత్‌ నుంచి మరే క...

దాయాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తత

చిత్రం
ఆసియా ఖండంలోని దాయాది దేశాలైన పాకిస్థాన్ , ఇండియాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థిని నెలకొంది. ఎప్పుడైతే మోదీ దేశ ప్రధాన మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టారో ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తరుచూ గిల్లికజ్జాలు మొదలయ్యాయి. పాక్ నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడడంతో మోదీ ఇక వెనుదిరగలేదు. ఏదో ఒకటి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాక్ అనుసరిస్తున్న తీరుపై ప్రపంచానికి తెలియ చెప్పే ప్రయత్నం చేసారు. అయినా దాయాది  పాకిస్థాన్ లో ఎలాంటి మార్పు రాలేదు. అంతే కాకుండా పరోక్షంగా తీవ్రవాదులకు ఊర్థం ఇవ్వడంతో గట్టి బడికి చెప్పాలని డిసైడ్ అయ్యారు మోదీ అండ్ షా. కొన్నేళ్లుగా నాన్చుతూ వస్తున్న 370 వ ఆర్టికల్ ను రద్దు చేస్తూ భారత తీర్మానం చేసింది. దీంతో మరింత కవ్వింపు చర్యలకు దిగింది పాకిస్థాన్. ఈ విషయంపై లేనిపోని రాదాంతం చేస్తూ తనకు తానే అభాసు పాలైంది . ఒక్క చైనా, అమెరికా తప్పా అన్ని దేశాలు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు . అది ఇండియా అంతర్గత అంశమని కొట్టి పారేశాయి . అయినా పాక్ ఊరు కోవడం లేదు . దానిని రచ్చ రచ్చ చేస్తోంది . దీంతో ఇరు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ...

వెండి వెన్నెల కన్నాంబ

చిత్రం
తెలుగు సినిమా ఎందరికో నీడనిచ్చింది. మరి కొందరికి బతుకును ప్రసాదించింది. టాలెంట్ అన్నది కొందరికి రెడ్ కార్పెట్ పరిస్తే మరి కొందరిని వెనక్కి నెట్టేసింది. కాలాన్ని గుర్తించి అవకాశాలు చేజిక్కించుకుని ముందుకు వెళ్లిన వాళ్లలో ఎందరో. అలాంటి వారిలో ఆనాటి పాతతరం నటీమణుల్లో పసుపులేటి కన్నాంబ ఒకరు. నటిగా , గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1912లో జన్మించిన కన్నాంబ, ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది.  తన నాటకరంగ అనుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. హరిశ్చంద్ర, పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి , అనార్కలి, దక్షయజ్ఞం , తోడికోడళ్ళు, కృష్ణ కుచేల, తదితర చిత్రాలలో ఆమె నటించి మెప్పించారు .   ఎం.జి.రామచంద్రన్, ఎన్.ఎస్.రాజేంద్రన్, శివాజీగణేశన్, నాగయ్య, పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు, తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో ...

నటించి మెప్పించిన కాంచన

చిత్రం
సినిమా అన్నది ఓ వ్యసనం . ఆడో అంతులేని రంగుల ప్రపంచం. కాదనలేం . కానీ దాని గురించి మాట్లాడకుండా ఉండలేం. ఎందుకంటే అది సినిమా కనుక. వేలాది మంది ఈ రంగాన్ని నమ్ముకుని బతుకుతున్నారు . ఇంకొందరు తమకు ఎప్పుడు గెలుపు వరిస్తుందా అనుకుంటూ గడుపుతున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు . ఉంటారు కూడా .. ఎన్నో విషాదాలు అంతకంటే ఎక్కువగా విజయాలు నమోదు అయ్యాయి. ఈ రంగమే అంత. ప్రతిభ కలిగినా అవకాశాలు రాక నిరాశకు లోనే వాళ్ళు ఎందరో. అప్పట్లో ఛాన్సెస్ తక్కువ . కానీ ఇప్పుడు సీన్ మారింది. నీ టాలెంట్ నీకే స్వంతం. ఒక్కసారి క్లిక్ అయితే చాలు లైఫ్ ఇక బిందాస్. ఇక ఆపాత మధురాలు విషయానికి వస్తే, కాంచన అసలు పేరు వసుంధరాదేవి. పాతకాలం నాటి సినిమాల్లో కొత్త ట్రెండ్ సృష్టించింది ఆమె. ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో సంపన్న కుటుంబములో జన్మించిన ఆమె చిన్న తనములోనే భరత నాట్యం , సంగీతంలో  శిక్షణ పొందారు . ఈ అనుభవం సినిమాలో ఎంటర్ అయ్యేందుకు దోహదపడ్డాయి . నటిగా రాణించడానికి మార్గం చూపాయి . ఈమె బ్రహ్మచారిణిగా జీవితాన్ని గడిపింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారు మారు కావడంతో కాంచన చదువు ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించింది. 1...

సకల కళా నైపుణ్యం ఆమె స్వంతం

చిత్రం
నటిగా , గాయనిగా తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆమె బతికే ఉంటారు. తెలుగు వారికి ఇష్టమైన నటీమణుల్లో భానుమతి ఒకరు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టారు . కొందరిలో కొన్ని కళలు మాత్రమే ఉంటాయి . కానీ ఆమెకు మాత్రం అన్ని కళల్లో ప్రావీణ్యం ఉన్నది . అందుకే ఆమె అంటే చాలా మంది అభిమానులు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటారు . నటి గా , నిర్మాతగా , డైరెక్టర్ గా , రచయిత్రిగా , సింగర్ గా రాణించారు మెప్పించారు . తనను తాను నిరూపించుకున్నారు. సంగీత దర్శకురాలిగా మెప్పించారు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వర విక్రయం అనే సినిమాలో నటించింది. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటర్  అయిన  రామకృష్ణారావునుపెళ్లి చేసుకుంది . . తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారీ దంపతులు.  భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966 లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాక రాదని ఆమె తండ్రి షరతు విధించాడు. హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.భానుమతి అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది మల్లేశ్వరి సి...

ఆ రూపం అపురూపం .. ఆ నటన అమోఘం

చిత్రం
తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం ఆమె రూపం . ఆమె నటన అమోఘం..అందుకే ఎవర్ గ్రీన్ హీరోయిన్. ఏ పాత్రలో జీవించినా ఒదిగి పోయి నటించి, మెప్పించిన నటీమణి సావిత్రి. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో 1936 జన్మించారు ఆమె. 1981 లో కన్నుమూశారు. ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఓ రకంగా ఆమె లేకుండా సినిమాలు తీయలేని స్థితికి చేరుకున్నారు. అంతలా తన నటనతో వేలాది మంది అభిమానులను పొందిన ఘనత సావిత్రికి మాత్రమే దక్కింది. ఎన్నో జీవిత చరిత్రలు, లఘు చిత్రాలు , సినిమాలు కూడా ఆమె పేరుతో వచ్చాయి. ఇప్పటికి ఎప్పటికి ఆమెకు ఆమే సాటి .అంతలా తెలుగువారి హృదయాల్లో నిలిచి పోయారు. నటిగా , దర్శకురాలిగా పేరొందిన ఆమె జీవితం ఒడిడుకులు లోనైంది. తెర మీద నటించినా జీవితంలో చాలా మంది ఫెయిల్ అయినా వాళ్ళు ఎందరో ఉన్నారు. మానసిక పరమైన అశాంతి , ఒంటరితనం సినిమా రంగాలలోని వారిని వెంటాడుతూనే ఉంటాయి. కావాల్సిందల్లా కాసింత ఓదార్పు .ఆమె అసలు పేరు నిశ్శంకర సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న ఆమెను పెంచి పెద్ద చేశాడు. చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగినఆమె తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే ప్రముఖ హిం...

నటనలో మేటి ..కృష్ణకుమారి..!

చిత్రం
తెలుగు సినిమా రంగం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడున్న అవకాశాలు అప్పుడు లేవు ..సాంకేతిక పరంగా  చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పాత తరం నటీమణుల్లో కృష్ణకుమారి ఒకరు. ఆమె స్వస్థలం బెంగాల్. అనుకోకుండా ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించారు. 1933 లో జన్మించిన ఆమె 2018 లో మరణించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 25 సంవత్సరాలకు పైగా 150 లకు పైగా  చిత్రాల్లో నటించారు.  మూడు జాతీయ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకున్నారు.  తండ్రి ఉద్యోగ రీత్యా పలు చోట్లకు మారారు. చెన్నైలో ఉండగా సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యారు. వివాహంతర్వాత  భర్తతో కలిసి బెంగుళూరులో ఉన్నారు.  వేదాంతం జగన్నాథ శర్మ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. మరో అక్క దేవకి కూడా ఒకటి, రెండు సినిమాల్లో నటించారు. కానీ ఆమె చిన్న వయసులోనే మరణించింది. తండ్రి బదిలీల మూలంగా విద్యాభ్యాసం రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా మొదలైన ప్రదేశాలలో జరిగింది. మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత మద్రాసుకు చేరుకుంది వీరి కుటుంబం. ఒకసారి ఆమె తల్లితో సహా స్వప్నసుందరి సినిమ...

ఆప్-కు అగ్ని పరీక్ష..పవర్ కోసం కేజ్రీ క్రేజీ

చిత్రం
కేంద్రంలో కొలువు తీరిన కమల సర్కార్ కు కంట్లో నలుసులా తయారైన ఆప్ సర్కార్ ను ఎలాగైనా సరే రాబోయే ఎన్నికల్లో ఓడించాలని పావులు కదుపుతోంది. చాప కింద నీరులా కామ్ గా తన పని తాను చేసుకుంటోంది. ఇంకో వైపు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మరో ఆరు నెలల్లో విధాన సభ కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు కేజ్రీవాల్. 2013 , 2015 లలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. గత నాలుగు నెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీట్ ను కూడా చేజిక్కించు కోలేక పోయింది . దీంతో ఎన్నడూ లేనంతగా ఆప్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ పెట్టినప్పుడు పేరున్న నాయకులు , సామాజిక వేత్తలు, అనుభవం కలిగిన నాయకులు పెద్దఎత్తున చేరారు . రాను రాను కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలు నచ్చక ఒక్కొక్కరు బయటకు వెళ్లి పోయారు. దీంతో ఆప్ లో కేజ్రీ ఒక్కరే ఒంటరిగా మిగిలారు . ఢిల్లీ వాసులకు కరెంట్ , నీళ్లు ఇచ్చే పథకాలపై ద్రుష్టి పెట్టారు సీఎం. విలువలే ప్రాతిపదికగా చెప్పుకుంటూ పవర్ లోకి ...

ఓరియంటేషన్‌ క్లాసెస్‌ స్టార్ట్ .. భయపడుతున్న స్తూడెంట్స్

చిత్రం
తెలంగాణాలో ఇంజనీరింగ్ చదువు కోవడం గగనంగా మారింది. ఇప్పటికే ఎంసెట్ కౌన్సిలింగ్ ముగియడంతో విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీలు , ఎంచుకున్న కోర్సులలో చేరారు. అయితే ర్యాగింగ్ భయం స్తూడెంట్స్ ను వేధిస్తోంది. ఇప్పటికే గతంలో పలు సంఘటనలు చోటు చేసుకున్న దృష్ట్యా ఆయా కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . ఎవరైనా సరే ర్యాగింగ్ కు పాల్పడినట్లు తేలితే , వారిని కాలేజీల నుండి తొలగించడం, జీవిత కాలంలో ఎక్కడా చదువుకునే అవకాశం లేకుండా చేస్తామని హెచ్చరికలు జారీ చేసారు. అయినా ఎక్కడో ఒక చోట ర్యాగింగ్ జరగక పోయినా, ఏదో రకంగా సీనియర్లు జూనియర్లను వేధిచడం మామూలై పోయింది. ఈ సారి జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ వినూత్న రీతిలో ర్యాగింగ్ కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఇప్పటికే ఆయా కాలేజీలలో ఓరియంటేషన్ క్లాసులు మొదలయ్యాయి. విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం కావడంతో స్తూడెంట్స్ కొత్తగా ఫీల్ కావడం కూడా మరో కారణం అవుతోంది. దీంతో నూతన విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. ‘ర్యాగింగ్‌ చేస్తే ఇక ఇంటికే’ అనే నినాద...

రవిశాస్త్రి ఎంపిక లాంఛనప్రాయమేనా..?

చిత్రం
భారత క్రికెట్ జట్టుకు ఎవరు కోచ్ గా ఉంటారనే దానిపై ఇంకా కొలిక్కి రాక పోయినా రవిశాస్త్రి నే తిరిగి కోచ్ గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఇండియా జట్టు సెమీస్ దాకా వెళ్లి ఓటమి పాలవడంతో కోచ్ కథ ముగిసినట్టేనని భావించారు. అభిమానులు ఇక కోచ్ ను మార్చండని అభిప్రాయలు వ్యక్తం చేశారు. కానీ కోచ్ ఎంపిక కమిటీ ఈ రోజు వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బాద్యులు ఎమ్మెస్కె ప్రసాద్ ..ఇటీవల తమపై వస్తున్న విమర్శలకు బదులు ఇచ్చారు. తమకు కూడా అనుభవం ఉన్నదని, క్రికెట్ జట్టు ఎంపిక అన్నది కట్టి మీద సాము లాంటిదని , తాము ఏమికా చేసిన జట్టు లో ఆటగాళ్లు బాగానే ఆడారని తెలిపారు. బీసీసీపై మాజీ సారధి గవాస్కర్ తీవ్ర ఆరోపణలు చేశారు . సెలక్షన్ కమిటీ ఏం చేస్తోందంటూ మండిపడ్డారు . దీనిపై ప్రసాద్ ఘాటుగా బదులిచ్చారు. కోచ్ ను ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని , భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కోచ్ ఎంపిక భాద్యతను ముగ్గురు సభ్యులు కలిగిన ఎంపిక కమిటీ చూసుకుంటుందని వెల్లడించారు. దీనికి కపిల్ దేవ్ , గైక్వాడ్ , డయానా ఉన్నారు . అయితే జట్టు ఓటమి చెందడంతో కొత్త...