బ్లూ స్మార్ట్ లో దీపికా పదుకొనే పెట్టుబడి

ఇండియాను స్టార్ట్ అప్స్ ఏలుతున్నాయి. భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. డిఫరెంట్ ఐడియాస్ తో అంకురాలను ఏర్పాటు చేసే వారికి కంపెనీలు, బ్యాంకులే కాదు క్రీడా, సినిమా రంగాలకు చెందిన వారు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఎలక్ట్రిక్ ట్యాక్సీ స్టార్ట్ అప్ బ్లూ స్మార్ట్ లో ప్రముఖ నటి దీపికా పదుకొనే మూడు మిలియన్స్ ను పెట్టుబడిగా పెట్టింది. ఈ కంపెనీ ఢిల్లీ , ముంబై, హైదరాబాద్ లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇండియాలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటిగా దీపికకు పేరుంది. కాగా ఇప్పటి దాకా డ్రమ్స్ ఫుడ్ , బెల్లట్రిక్స్ ఎయిరోస్పెస్, మైంత్ర స్టార్ట్ అప్ లలో ఆమె పెట్టుబడులు పెట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న సామెతను ఈ ముద్దుగుమ్మ ఆచరిస్తోంది. సినిమా రంగం అన్నది జూదం లాంటిది. ఎప్పుడు స్టార్ డం ఉంటుందో తెలియదు. అందుకే సంపాదించిన డబ్బులను ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే మరింత లాభాలు పొందవచ్చని దీపికా పదుకొనే ఆశ. ఆమె ఇన్వెస్ట్ చేసిన ప్రతి స్టార్ట్ అప్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. కాగా ఇప్పటికే బ్లూ స్మార్ట్ వ్యాపారం కూడా గాడిలో పడింది. తమ వ్యాపారాన్ని మరింత గా విస్తరించేందుకు...