వ్యవసాయానికి కేంద్రం సాయం

రెండు నెలలు గడిచినా వరుణ దేవుడు కరుణించడం లేదు. ఒక్క ముంబయిని మాత్రమే కరుణించగా మిగతా ప్రాంతాల్లో ఒక్క నీటి చుక్క పడలేదు. భూములను నమ్ముకుని వానల కోసం ఎదురు చూస్తున్న కోట్లాది రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం తాగేందుకు సైతం నీరు దొరకని పరిస్థితి దాపురించింది. ఓ వైపు ఎక్కువ శాతం నీళ్లు సముద్రం పాలవుతున్నా వాటిని ఒడిసి పట్టుకునే సాంకేతిక నైపుణ్యాన్ని ఇన్నేళ్లయినా ఏ ప్రభుత్వం అమలు చేసిన పాపాన పోలేదు. చెరువులు, కుంటలు బోసిపోయినవి. వానమ్మ జాడ లేదు. గత ఏడాది కొంత మేరకు రుతు పవనాలు ముందుగానే వీచినా కాస్తో కూస్తో తాగు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఈసారి పూర్తిగా పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. కనీసం ఒక్క టీఎంసీ నీళ్లు కూడా ఆయా ప్రాజెక్టుల్లోకి రాలేదు. ఇక సాగు మాట దేవుడెరుగు..తాగేందుకు ఎట్లా అన్నది జనాన్ని తొలుస్తున్నది. రోజు రోజుకు జనాభా పెరుగుతూ పోతుండగా దానిని కంట్రోల్ చేయలేక ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. అక్కడక్కడ చెదురు మదురుగా కురిసిన తొలకరి వర్షాలకు రైతులు గత్యంతరం లేక పొలాలను దుక్కి దున్ని చదును చేసి ప...