జార్జి రెడ్డి జీవితం ఎందరికో ఆదర్శం

జార్జిరెడ్డి నేటి తరానికి ఆదర్శమని, ఆయన సినిమాను అడ్డుకుంటే సహించేది లేదని అభిమానులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అరాచక శక్తులు సినిమాను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని, దాన్ని విరమించు కోవాలన్నారు. లేని పక్షంలో ఊరుకోబోమని హెచ్చరించింది ఇండియన్ నేషనల్ యువజన పార్టీ. ఇదిలా ఉండగా చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న జార్జిరెడ్డి జీవితం, నేటి యువతకు స్ఫూర్తి దాయకమని జార్జిరెడ్డి చిత్ర దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు. సినిమా విడుదల సందర్భంగా నారాయణగూడలోని క్రైస్తవ స్మశాన వాటికలో జార్జిరెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నీతి, నిజాయితీ గల జార్జి రెడ్డి రేపు మళ్లీ పుట్టబోతున్నాడని, ఆయన జీవితం అందరికి ఆదర్శ ప్రాయంగా ఉంటుందన్నారు. జార్జి రెడ్డి చిత్రం విడుదల తర్వాతే ఎవరికైనా తాను సమాధానం చెబుతానని దర్శకుడు స్పష్టం చేశారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించలేదని, ఆయన నీతి, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు తనను ఎంతో ఆకట్టు కున్నాయని, రెండేళ్ల పాటు జార్జిరెడ్డి జీవితాన్ని అధ్యయనం చేశాక సినిమాగా చేశామని చెప్పారు. 25 ఏళ్లకే ఓ విద్యార్థి నాయకుడిగా ఎదిగి న...