పక్కా లోకల్..భారీగా రిక్రూట్‌మెంట్..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

సందింటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఏ సీఎం తీసుకోని నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. తమ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఏకంగా ఒకటి కాదు వందలు కాదు..4 లక్షల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇందులో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిశ్రమల్లో కూడా వారికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు పదవులతో పాటు పనుల్లో 50 శాతం కోటాను అమలు చేస్తామన్నారు. వీటిలో సగానికి పైగా మహిళలే ఉంటారన్నారు. కౌలు దారు ఇక సాగుదారుగా మార్చేస్తామని, శాశ్వత బిసి కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విధానసభలో ఆరు ప్రధానమైన బిల్లులు పాస్ చేశారు. ఈ మేరకు ఏపీలో నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, మొత్తం మీద మహిళలకు మరో 50 శాతం రిజర్వేషన్లు వర్తింప చేసే నాలుగు వేర్వేరు బిల్ల...