సమున్నత భారతం..విస్తు పోయిన ప్రపంచం..!

నరేంద్ర దామోదర దాస్ మోదీ పేరు మరోసారి ప్రపంచమంతటా మార్మోగి పోయింది. సమున్నత భారతావని తల ఎత్తుకునేలా భారత ప్రధానికి అపూర్వమైన రీతిలో స్వాగతం లభించింది. హ్యూస్టన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో మోదీతో పాటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాల్గొన్నారు. దాదాపు 50 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. మొదటి నుంచి సభ ముగిసే దాకా చప్పట్లతో దద్దరిల్లి పోయింది. ఇండియన్స్ ఉత్సాహాన్ని చూసిన అమెరికా ప్రెసిడెంట్ చెప్పలేని సంతోషానికి లోనయ్యారు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలు ఒకే వేదికపైకి రావడం అపూర్వమనే చెప్పు కోవాలి. సమస్త మానవాళికి పెను ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం అంతు చూసేందుకు ఇరు దేశాలు కలిసి కట్టుగా పోరాడుతాయని స్పష్టం చేశారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు సభికులు హర్షద్వానాలు చేస్తూనే ఉన్నారు. అడుగడుగునా మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి భావోద్వేగంతో ప్రసంగించారు. మీరందరినీ ఇలా కలుసు కోవడం ఆనందంగా ఉన్నది. హౌడీ మోదీ అంటూ మీరు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ నేను ఒక్కడినే ఏమీ చేయలేను. 130 కోట్ల ప్రజలు ఆదేశాల మేరకు నడుచుకునే అత్యంత సామాన్యుడిని. మీరు నన...