హెచ్‌సీఏలో కొత్త ట్విస్ట్..గడ్డం వివేక్ కు షాక్ ..అజ్జూ బాయ్ కే ఛాన్స్.!

తెలంగాణలోని హైదరాబాద్ క్రికెట్ అసోషియన్ కు ఎక్కడలేని డిమాండ్ ఉంది. దీనిపై జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ పదవి కోసం ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కోర్టు మెట్లు ఎక్కారు. ప్రపంచంలోనే మణికట్టు మాంత్రికుడిగా, బ్యాట్సమెన్ గా ఇప్పటికే పేరు పొందిన మాజీ సారథి మహమ్మద్ అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడి పదవిని చేజిక్కించుకోలేక పోయారు. అజ్జూ బాయ్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఓడిపోయి తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. మొత్తం మీద ఒక పత్రిక, న్యూస్ ఛానల్ తో పాటు విబోర్డ్ , విశాఖ కంపెనీలకు వివేక్ చైర్మన్ గా ఉన్నారు. మొదట్లో కాంగ్రెస్ లో ఉన్నారు. టీఆరెఎస్ లో చేరారు.

తిరిగి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక బిజినెస్ మెన్ గా ఉన్న వివేక్ ఎలా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేస్తారంటూ అజ్జూ బాయ్ తో పాటు ఇతర క్రికెటర్స్ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోసారి హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు చుక్కెదురైంది. మాజీ అధ్యక్షుడు వివేక్‌ వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. వివేక్‌ నామినేషన్‌ వేసే క్రమంలో సస్పెన్స్‌ నెలకొన్నప్పటికీ ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్న్‌ ఆఫీసర్ నిర్ణయం తీసుకున్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి వివేక్‌ అనర్హుడని భావించడంతోనే ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైనట్లు సమాచారం. 

వివేక్‌కు సంబంధించిన ఓ కేసు ఒకటి సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. దానిపై ఇంకా ఎలాంటి తుది తీర్పు రాక పోవడంతో వివేక్‌ హెచ్‌సీఏ ఎన్నికకు దూరం కావాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ వేసిన, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌కు మార్గం సుగమం అయ్యింది.  రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో అజహరుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్‌ దాఖలు చేశారు అజహర్‌. ఈనెల 27వ తేదీన జరుగునున్న హెచ్‌సీఏ ఎన్నికలో భాగంగా అజ్జూ బాయ్ నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద వివేక్ అడ్డంకి తొలగడంతో అజహర్ గెలుపు ఇక నల్లేరు మీద నడకేనని క్రికెట్ అభిమానులు అంటున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!