పోస్ట్‌లు

సెప్టెంబర్ 21, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

శివప్రసాద్ ఇక లేరు

చిత్రం
మాజీ ఎంపీ, తెలుగుదేశం సీనియర్ నాయకుడు శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో పార్టీ గొప్ప కళాకారుడు, సామాజిక చైతన్యం కలిగిన రాజకీయ నాయకుడిని కోల్పోయింది. ఆయన పలు సినిమాల్లో నటించారు. గతకొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత  వ్యాధితో బాధ పడుతున్నారు.ఆయనకు 68  ఏళ్ళు. చిత్తూర్ జిల్లా పొట్టిపల్లిలో 1951 లో జన్మించారు. తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచార శాఖా మంత్రిగా పని చేశారు. ఎంపీగా గెలిచారు. అనేక పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా పని చేశారు. రాష్ట్ర విభజన సమయంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. శివప్రసాద్ కు కళలన్నా, సాహిత్యమన్నా యెనలేని ప్రేమ. స్వతహాగా కళాకారుడైన ఆయన పాటలు, పద్యాలు పాడటంలో ఆయనకు ఆయనే సాటి. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సమైక్య ఆంధ్ర పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. శివ ప్రసాద్ స్వతహాగా రంగస్థల నటుడు. ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. అనుకోకుండా సినిమా రంగంలోకి ప్రవేశించారు. క్యారెక్టర్ న...