కిరాణా దుకాణాలపై కన్నేసిన ఫ్లిప్ కార్ట్

భారతీయ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నా ఇండియాలో మాత్రం ఈ కామర్స్ బిజినెస్ మాత్రం దూసుకు వెళుతోంది. ఇటు ఆఫ్ లైన్ లోను ..అటు ఆన్ లైన్ లో వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇప్పటికే అమెజాన్, స్నాప్ డీల్ , ఫ్లిప్ కార్ట్ కంపెనీలు ఈ కామర్స్ రంగంలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి. ఈ మూడు కంపెనీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ దేశీయ కంపెనీలు కాగా అమెజాన్ మాత్రం అమెరికా దేశానికి చెందింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఇండియాపై కన్నేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా కొనుగోలు చేస్తున్న కంట్రీగా భారత దేశం ఉండడంతో అన్ని కంపెనీలు ఇటు వైపు చూస్తున్నాయి. ఇక ఇప్పటికే ఇండియన్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపిస్తూ రోజు రోజుకు సరి కొత్త నిర్ణయాలతో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది రిలయన్స్ కంపెనీ. తాజాగా డిజిటల్ , ఈ కామర్స్ బిజినెస్ రంగంలోకి ఎంటర్ అవుతున్నట్లు కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఆయిల్, టెలికాం, జ్యుయెలరీ , టాయిస్ , ఫ్యాషన్ , దుస్తుల రంగాలలోకి ప్రవేశించింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ...