ఉత్కంఠ రేపుతున్న బిగ్ బాస్ .. అయ్యో తమన్నా అవుట్

బుల్లితెర రంగంలో బిగ్ బాస్ ప్రోగ్రాం సంచలనం సృష్టిస్తోంది . అంచనాలకు మించి రేటింగ్ లోను దూసుకెళుతోంది. మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారినప్పటికీ ఈ రియాల్టీ షో మాత్రం మా స్టార్ టీవీ యాజమాన్యం కు ఇటు నిర్వాహకులకు అనుకోని రీతిలో స్పందన లభిస్తోంది . దీంతో ఇప్పటికే భారీ ఎత్తున కొనుగోలు చేసిన స్టార్ టీవీకి ఈ ఒక్క షో ద్వారానే ఇరు రాష్ట్రాలలో టీవీ పేరు మార్మ్రోగి పోతోంది . ఊహించని రీతిలో ట్విస్ట్ లు , ఆటలు, ప్రశ్నలు , ఇలా ప్రతి సన్నివేశంలోనూ బిగ్ బాస్ అంచనాలకు అందకుండా పోతోంది .ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది . సరిగ్గా రాత్రికి ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం దెబ్బకు మిగతా ఛానల్స్ వినోదం కలిగించేలా కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు . భారీ ఎత్తున బిగ్ బాస్ ను చూస్తుండడం తో యాజమాన్యానికి కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ప్రకటనల పరంగా కూడా వర్కవుట్ అవుతోంది . సెలెబ్రెటీలు , హీరోలు , యాంకర్లు , సింగర్స్ , సినిమా కు చెందిన పాపులర్ పెర్సనాలిటీస్ తో ప్రతి రోజు ఆకట్టుకునేలా తీర్చి దిద్దారు నిర్వాహకులు . ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం బంపర్ గా సక్సెస్ అయ్యింది ...