పల్లె నుంచి కేన్స్ ఫెస్టివల్ దాకా – కథకు దక్కిన గౌరవం – డొమ్నిక్ సంగ్మాకు సలాం

పదేళ్ల వయసున్నప్పుడు ఆ కుర్రాడు మొదటి సారిగా కల కన్నాడు. అప్పుడే మిణుకు మిణుకుమంటూ టీవీని చూశాడు. అదో అద్భుతంలా అనిపించింది. ఒక రోజు రాత్రంతా మేల్కొన్నాడు. టీవీలో పెట్టిన సినిమాను చూశాడు. ఆ ఊరులో డబ్బున్నది ఒకే కుటుంబానికి . ఆ ఇంట్లోనే టీవీ వుంటుంది. అప్పుడే..ఏదో ఒక రోజు తాను సినిమా తీస్తానని నిర్ణయించుకున్నాడు. తన కలను నిజం చేశాడు. అతడే మేఘాలయలోని గారో హిల్స్‌కు చెందిన డొమ్నిక్ సంగ్మా. ఇపుడు అతడు ప్రపంచంలోని పేరెన్నికగన్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తాను తీసిన సినిమాకు అరుదైన అవార్డును అందుకున్నారు. ఇది కళ్ల ముందు జరిగిన కన్నీటి కథ. కథలు ఎట్లా రాస్తారు అంటూ ఖాదర్ మోహియుద్దీన్ పుస్తకం రాసినప్పుడు కలిగిన సందేహం ఇపుడు కలుగుతోంది. అవును..కథలు ఎట్లా పుడుతాయి. ప్రతి కథకు ప్రారంభం ..ముగింపు వుంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో కథ వుండే వుంటుంది.కానీ కొందరు చెప్పుకోరు..ఇంకొందరు చెప్పటానికి ఇష్టపడతారు. తేడా ఏమిటంటే చిన్న పాటి దూరమంతే. ఇక్కడే కలలు వుంటాయి. కన్నీళ్లు వుంటాయి. వెచ్చని కబుర్లుంటాయి. కావాల్సిందల్లా ఆ సన్నివేశాలకు అనుగుణంగా పోగేసుక...