పోస్ట్‌లు

జులై 1, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

చుక్క‌లు చూపించిన విండీస్ - చెమ‌టోడ్చిన శ్రీ‌లంక - వారెవ్వా పూర‌న్ ..!

చిత్రం
వెస్టిండీస్ జ‌ట్టు తానేమిటో మ‌రోసారి రుచి చూపించింది లంకేయుల‌కు. పూర‌న్ పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఆడాడు. గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. ఒకానొక ద‌శ‌లో లంక ఓడిపోతుంద‌నిపించింది. అడ్డుగోడ‌లా ఫెర్నాండ్ నిల‌బ‌డ‌క పోతే ఆ జ‌ట్టు ఆశ‌లు గ‌ల్లంత‌య్వేవి. ఇప్ప‌టికే ఏడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి ..ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ను దాదాపు నిష్క్ర‌మించిన విండీస్ జ‌ట్టు ఆఖ‌రు మ్యాచ్ శ్రీ‌లంక‌తో త‌ల‌ప‌డాల్సి వ‌చ్చింది. ఎలాగైనా లంక‌పై గెలిచి పోయిన ప‌రువును నిల‌బెట్టు కోవాల‌నే క‌సితో విండీస్ ఆట‌గాళ్లు క‌సితో ఆడారు. దుమ్ము రేపారు. లంకేయుల‌కు ద‌డ పుట్టించాడు ఒకే ఒక్క‌డు పూర‌న్. మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జ‌ట్టు 339 ప‌రుగులు చేసింది. ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు రంగంలోకి దిగిన విండీస్ జ‌ట్టు ..199 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయింది. ఈజీగా గెలుస్తుంద‌నుకున్న లంక జ‌ట్టు చెమ‌టోడ్చాల్సి వ‌చ్చింది. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన అసాధార‌ణ‌మైన రీతిలో నికోలాస్ పూరన్ వ‌స్తూనే దాడి చేయ‌డం ప్రారంభించాడు. 103 బంతులు ఆడి 11 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 118 ప‌రుగులు చేశాడు. విండీస్ ను గెలిపించినంత ప‌ని చేశాడు. కీల‌క ద‌శ‌...

అంకురాల‌కు వెస‌లుబాటు - ఎస్‌బిఐ తోడ్పాటు..!

చిత్రం
గొప్ప గొప్ప ఆలోచ‌న‌లు ఎక్క‌డి నుంచో ఊడి ప‌డ‌వు. ఎవ‌రో చెబితే రావు. మెంటార్స్, ట్రైన‌ర్స్‌, టీచ‌ర్స్‌, లెక్చ‌ర‌ర్స్‌, స్వామీజీలు, పేరెంట్స్ ..నుంచి నేర్చుకుంటే అస‌లే వ‌ర్క‌వుట్ కావు. గుండెలు మండిపోతే..మెద‌ళ్లకు ఒత్తిడి అంటూ పెరిగి పోతే, అవ‌కాశాల దారులు మూసుకుపోతే, ఒంట‌రిగా ఒక్క‌రే ఆలోచిస్తూ..ప్ర‌పంచానికి దారులు చూపించే ఏ ఒక్క ఐడియానైనా క్రియేట్ చేసుకోగ‌లిగితే చాలు. ఇంకేముంది ఎవ్వ‌రి వాకిళ్ల‌లోకి వెళ్లాల్సిన ప‌నిలేదు. ఇంకొక‌రి ద‌యాదాక్షిణ్యాల‌పై బ‌త‌కాల్సిన ఖ‌ర్మ అంటూ వుండ‌దు. ఒక‌ప్పుడు పెట్టుబ‌డి కావాలంటే, రుణాలు పొందాలంటే నానా ఇక్క‌ట్లు. లంచాలు ఇవ్వాలి, అడుక్కోవాలి. కానీ ఇప్పుడా దుర్భ‌ర‌మైన ప‌రిస్థితులు లేవు. మీకంటూ ఓ ఐడియా వుంటే , అది స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేలా ఉంటే, క‌నీసం ప‌ది మందికైనా లైఫ్ ఇవ్వ‌గ‌లిగితే చాలు..ఇంకేమీ అక్క‌ర్లేదు . మీ కోసం వేలాది సంస్థ‌లు, బ్యాంకులు, ప్ర‌భుత్వాలు కాచుకుని ఉన్నాయి. కావాల్సింద‌ల్లా మీ మీద మీకు న‌మ్మ‌కం. స‌క్సెస్ అవుతుంద‌న్న ప‌ట్టుద‌ల ఉంటే ..మీ చెంత‌కే కాసులు వాలిపోతాయి. మీ బ్యాంకు ఖాతాలో డ‌బ్బులు జ‌మ అవుతాయి. డ‌బ్బులు ఒకే చోట వుంటే ఏం లాభం. అవి చేతు...

కాలేజీ యాజ‌మాన్యాల‌కు సుప్రీం ఝ‌ల‌క్ - అడ్డ‌గోలు ఫీజుల పెంపుపై ఆగ్ర‌హం

చిత్రం
                      నిన్న‌టి దాకా అడ్డ‌గోలుగా ..త‌మ ఇష్టానుసారం ఫీజుల‌ను పెంచుకుంటూ పోయిన తెలంగాణ‌లోని ఇంజ‌నీరింగ్ కాలేజీ యాజ‌మాన్యాల అడ్డగోలు దందాల‌కు సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఝ‌లక్ ఇచ్చింది. ప్ర‌తి ఏడాది హ‌ద్దు ప‌ద్దు అంటూ లేకుండా కూర‌గాయ‌ల మార్కెట్‌లో ధ‌ర‌లు పెంచిన‌ట్టుగా ఫీజులు వ‌సూలు చేస్తూ విద్యార్థుల‌ను వారి త‌ల్లిదండ్రుల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌స్తున్న ఈ న‌యా దందాకు చెక్ పెట్టింది. ఆయా కాలేజీల మేనేజ్‌మెంట్‌లు ఓ వైపు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ను పొందుతూనే మ‌రో వైపు దొడ్డిదారిన నియంత్ర‌లేని ఫీజుల‌ను ..బాజాప్తాగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న న‌యా దోపీడికి అడ్డుక‌ట్ట వేసింది. ఈ రాష్ట్రంలో కేజీ టు పీజీ అంటూ ఊద‌ర‌గొడుతున్న స‌ర్కార్‌కు కూడా ఓ ర‌కంగా దెబ్బ ప‌డిన‌ట్టే. ఆయా కాలేజీల‌న్నీ అన్ని పార్టీల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌కు , వారి బంధువుల‌కు, పార్టీల అనుచ‌రుల‌కు చెందిన‌వే ఉన్నాయి. -విద్యార్థుల‌కు ఊర‌ట - త‌ల్లిదండ్రుల‌కు బాస‌ట - హైకోర్టుకు అక్షింత‌లు అస‌లు విద్యాశాఖ ఉందో లేదో తెలియ‌ని ప‌రిస్థితి. రెండోసారి అధికారంలోక...

సిటీలో జ‌ర్నీ ..టోరా క్యాబ్స్‌తో ఈజీ

చిత్రం
టెక్నాల‌జీ రంగం రోజు రోజుకు కొత్త పుంత‌లు తొక్కుతోంది. దీని ఆధారంగా ఎన్నో అంకురాలు వెలిశాయి. మ‌రెన్నో కంపెనీలు డిఫ‌రెంట్ మోడ్‌లో అద్భుత‌మైన ఆవిష్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుడుతున్నాయి. ఎక్క‌డ టాలెంట్ వుంటే అక్క‌డ వాలిపోతున్నాయి. ప్ర‌పంచానికి స‌రిహ‌ద్దులు అంటూ ఏవీ లేకుండా పోయాయి. ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీతో లోకం మారిపోతోంది. క‌ష్టం అనుకున్న ప్ర‌తిదీ సులువుగా మారిపోతోంది. దీంతో జీవ‌న ప్ర‌యాణం సాఫీగా వుండేందుకే జ‌నం ఇష్ట‌ప‌డుతున్నారు. ఇటు సామాన్యుల నుండి అటు ఉన్న‌త వ‌ర్గాలు కూడా క‌ష్ట‌ప‌డ‌కుండానే లైఫ్ ను ఎంజాయ్ చేయాల‌ని ప‌రిత‌పిస్తున్నారు. ఇందు కోసం ఎంత ఖ‌ర్చు పెట్టేందుకైనా రెడీ అంటున్నారు. ఒక‌ప్పుడు ఎక్క‌డికైనా వెళ్లాలంటే నానా తంటాలు ప‌డాల్సి వ‌చ్చేది. బ‌స్సులు స‌రైన టైంకు వ‌చ్చేవి కావు. ఇక రైళ్ల గురించి చెప్పాలంటే చాంత‌డంత అవుతుంది. కోరుకున్న చోటుకు వెళ్లాలంటే నానా ఇబ్బందులు . బ‌జాజ్ ఆటోలు ప్ర‌వేశించాక మార్కెట్ స్వ‌రూప‌మే మారి పోయింది. ప్ర‌తి గ‌ల్లీకి ఇపుడు ఈజీగా వెళ్లొచ్చు.  అన్నీ ఇంటి వ‌ద్ద‌కే వ‌చ్చేస్తున్నాయి. రోజూ వారీగా ఉద‌యం లేస్తేనే పేప‌ర్ ద‌గ్గ‌రి నుండి, పాలు, ప‌నివాళ్లు, ...

లెజెండ్స్ క‌ల‌యిక‌..అభిమానుల కేరింత..!

చిత్రం
క్రికెట్ ఆట అంటే చాలు..చిన్నారుల నుంచి పెద్ద‌వాళ్ల దాకా ఫిదానే. ఇందులో ఐటీ కంపెనీల దిగ్గ‌జాలు కూడా ఉన్నారంటే న‌మ్మ‌లేం. ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ జ‌రుగుతుండ‌డంతో వ‌ర‌ల్డ్ వైడ్‌గా క్రికెట్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కోట్లాది మంది జ‌నం టీవీల‌కు అతుక్కు పోయారు. ఓ వైపు హాట్ స్టార్ మ‌రో వైపు యూట్యూబ్‌ల‌లో వీక్షిస్తున్నారు. ఇక హొట‌ళ్లు, రెస్టారెంట్లు, ప‌బ్‌లు, బార్లు, లాడ్జ్‌లు , ప్ర‌యాణికుల ప్రాంగ‌ణాలు, రేడియోలు, రైల్వే స్టేష‌న్‌లు, విమానాశ్ర‌యాలు, మాల్స్, స్టోర్స్‌, ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తి చోటా క్రికెట్ మ్యాచ్‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అంత‌గా ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ అయ్యిందీ ఈ ఆట‌. ఒక‌ప్పుడు గిల్లీ దండా ఆడేటోళ్లు ఊర్ల‌ల్ల‌. అదే ఇపుడు బంతి, బ్యాట్‌కు మ‌ధ్య వార్ న‌డుస్తోంది. తేడా అక్క‌డ గిల్లీ..దండా అంతే. కాలం మారింది. టెక్నాల‌జీ ప‌రుగులు తీస్తోంది. జ‌నం అభిరుచుల్లో , లైఫ్ స్ట‌యిల్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాలాన్ని గుప్పిట బిగించి కోట్లాది గుండెల్ని ల‌య‌బ‌ద్ధంగా ఒకే గొంతుకై క‌లిపేది ఒక్క‌టే క్రికెట్. అదే ఇప్పుడు అంత‌టా డామినేట్ చేస్తోంది. ల‌క్ష కోట్ల‌కు పైగా...