ప్రపంచాన్ని ప్రభావితం చేసే 100 పుస్తకాలు ఇవే..!

పుస్తకాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. జీవితం పట్ల, సమస్త ప్రపంచం పట్ల, సమాజం పట్ల ఎరుక కలిగి వుండేలా ..మనుషులు చెడిపోకుండా ఉండేలా చేస్తాయి. భోజనం చేయకుండా , దుస్తులు లేకుండా ఉండగలను కానీ పుస్తకాలు చదవకుండా నేనుండలేనంటాడు ఓ సందర్భంలో రష్యన్ మహా రచయిత మాగ్జిం గోర్కీ. తాజాగా బుక్ వరల్డ్ కు సంపాదకుడిగా వ్యవహరిస్తున్న స్టెఫనీ మెర్రీ వయస్సుల వారీగా అత్యుత్తమమైన ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్పనైన పుస్తకాల జాబితాను ప్రకటించారు. పుస్తక ప్రియుల కోసం , చదువరుల కోసం ఆ పుస్తకాలేమిటో తెలుసుకుందాం. మొదటి ఏడాదిలో ఎరిక్ కార్లే రాసిన ద వెరీ హంగ్రీ క్యాటర్ పిల్లర్ పుస్తకం మొదటి స్థానాన్ని ఆక్రమించింది. రెండు నుంచి 100 దాకా చూస్తే , అన్నా డేవ్డిన్నీ రాసిన లామా లామా రెడ్ పజామా రెండో స్థానాన్ని చేజిక్కించుకుంది. మౌరైజ్ సెండాక్ రాసిన వేర్ ద వైల్డ్ థింగ్స్ ఆర్ పుస్తకం మూడో స్థానం పొందింది. ఇక నాల్గో స్థానంలో క్రిష్ రచ్‌కా రాసిన చార్లీ పార్కర్ ప్లేయ్డ్ బి బాప్ పుస్తకం, ఐదో స్థానంలో షెల్ సిల్వర్‌స్టెన్ రాసిన ద గివింగ్ ట్రీ, ఆరో స్థా...