పోస్ట్‌లు

నవంబర్ 24, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అయోమయం..గందరగోళం

చిత్రం
తెలంగాణాలో రాత్రి రోడ్డు రవాణా సంస్థ భవితవ్యం ఇప్పుడు అంధకారంలోకి నెట్టి వేయబడింది. అటు కూడఁరంలోని బీజేపీ సర్కారుతో పాటు సీఎం కేసీఆర్ ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే పనిలో పడ్డారు. కోట్లాది ఆస్తులు కలిగిన ఆర్టీసీని గంపగుత్తగా అమ్మేసేందుకు పావులు కదిపారు. ఇప్పటికే ప్రైవేట్ బస్సులు దొడ్డి దారిన ఏర్పాటు అయ్యాయి. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సుల స్థాయిలోనే సేవలందిస్తున్న అద్దె బస్సుల భవితవ్యం గందర గోళంలో పడింది. ప్రభుత్వం 5,100 బస్సులను ఆర్టీసీ నుంచి మినహాయించి అంత మేర రూట్లను ప్రైవేటీకరించాలని నిర్ణయించడమే దీనికి కారణం. ఆర్టీసీకి సొంత బస్సులు సగం ఉండ నుండగా మిగతావి ప్రైవేటు పర్మిట్లతో నడిచే బస్సులు ఉంటాయని సీఎం ఇప్పటికే తేల్చి చెప్పడం, దీనికి హైకోర్టు అడ్డు చెప్పక పోవటంతో ఈ ప్రక్రియ అమలు దాదాపు ఖాయమైంది. అయితే ప్రైవేటీకరించే కోటా పరిధి లోకే అద్దె బస్సులు వస్తాయని గతంలోనే సీఎం స్పష్టం చేసిన నేపథ్యంలో అద్దె బస్సుల విధానమే రద్దవుతుందన్న ప్రచారం ఆర్టీసీలో మొదలైంది. అద్దె బస్సుల యజమానులనూ ప్రైవేటు పర్మిట్‌ బస్సుల పరిధిలోకి తెస్తారని చర్చ జోరుగా సాగుతోంది. ఆర్టీసీ తమతో పదేళ్ల ఒప్పందం కుదుర్...

కార్మికుల భవితవ్యం..సీఎంపైనే ఆధారం

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఆందోళన ఆఫ్ సెంచరీకి చేరుకుంది. ఇప్పటి దాకా తెలంగాణ ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు నుండి ఎలాంటి స్పందన కనిపించలేదు. ఇన్ని రోజులు గడిచినా శాశ్వత పరిష్కారానికి నోచుకోక పోవడంతో వేలాది మంది కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని సీఎంకు సూచించింది. దీంతో ఆర్టీసీ భవితవ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సంస్థ మనుగడ, రూట్ల ప్రైవేటీకరణ, సమ్మెలో ఉన్న కార్మికుల భవితవ్యంపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని అంశాలను చర్చించి ఆర్టీసీపై తుది నిర్ణయం తీసుకోవాలని గత ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. 5,100 రూట్ల ప్రైవేటీ కరణకు కేబినెట్‌ నిర్ణయానికి అనుకూలంగా హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రతి కొద్దీ గంటల్లో అందుబాటులోకి రానుందని, దీనిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆర్టీసీపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని రవాణా ...

రాజ్యం గవర్నర్ల భోజ్యం

చిత్రం
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్లు ఇప్పడు కింగ్ మేకర్లుగా అవతారం ఎత్తారు. దేశంలో ఆయా రాష్ట్రాల్లో అన్ని కార్యకలాపాలు వీరి ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ అంతా గవర్నర్ ద్వారానే నడుస్తుంది. విశిష్టమైన అధికారాలు ఉన్నప్పటికీ, కేంద్రంలో కొలువు తీరిన ప్రభుత్వం కనుసన్నలలోనే నడవాల్సి ఉంటుంది. దీంతో వీరు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా బీజేపీ పవర్ లోకి వచ్చాక అనైతిక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజాస్వామ్యానికి చేటు తెస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఎలాంటి మెజారిటీ లేకపోయినా మైనార్టీ సంఖ్యా బలం కలిగిన బీజేపీకి సర్కార్ ఏర్పాటుకు సహకరించారు అక్కడి గవర్నర్. దీనిని సవాలు చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల అధినేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఇలాంటి సంఘటనలు సమున్నత భారతావనిలో చాలానే జరిగాయి. తమిళనాడు, ఉమ్మడి ఏపీ, కర్ణాటక, తదితర రాష్ట్రాలు ఇందుకేమీ మినహాయింపు కాదు. ప్రభుత్వ ఏర్పాటులో, కీలక చట్టాలు అమలు చేయడంలో గవర్నర్లే కీలక భూమిక పోషిస్తారు. వీరు లేకుండా ప్రభుత్వం ఏర్పా...

స్థిరంగా ఈక్విటీ మార్కెట్స్

చిత్రం
గత ఏడాది కాలం నుండి తీవ్ర ఒడిదుడుకులకు లోనైన ఈక్విటీ మార్కెట్లు ఇప్పుడు కళకళ లాడుతున్నాయి. ప్రధాన   సెన్సెక్స్, నిఫ్టీ నూతన గరిష్టాలకు చేరువయ్యాయి. స్టాక్స్‌ పని తీరులో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఎంపిక చేసిన స్టాక్స్‌ మాత్రమే ర్యాలీ చేస్తున్నాయి. కొన్ని లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి పనితీరు చూపిస్తుండగా, అధిక శాతం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ వెనుకబడే ఉంటున్నాయి. మార్కెట్‌ ర్యాలీ చాలా సంకుచితంగా ఉంటోంది. దీంతో భిన్న మార్కెట్‌ క్యాప్‌ విభాగాల్లో పెట్టుబడుల పరంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భిన్న విభాగాల్లో ఎంపిక చేసిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే మల్టీక్యాప్‌ ఆధారిత ఫోకస్డ్‌ ఫండ్స్‌ను ఎంచు కోవడం మంచి నిర్ణయమే అవుతుంది. ఈ విభాగంలో యాక్సిస్‌ ఫోకస్డ్‌–25 మ్యూచువల్‌ ఫండ్‌ పథకం మంచి పనితీరుతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 20 శాతం రాబడులను ఇచ్చింది. కానీ, ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా చూసే నిఫ్టీ 50 టీఆర్‌ఐ పెరుగుదల 13.8 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో 17.5 శాతం, ఐదేళ్ల కాలంలో 12.9 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ ...

తారల సందోహం..మెగా సంతోషం

చిత్రం
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అలనాటి తారలు సందడి చేశారు. 1980 సంవత్సరం కాలంలో నటించిన నటులంతా  ప్రతి ఏడాది ఒక రోజు కలుసు కోవడం, అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నటి రేఖను కూడా ఆహ్వానించానని ఇటీవల జరిగిన ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఈ వేడుకలు రెండు రోజుల పాటు మెగాస్టార్ ఇంట జరిగాయి. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సినీ తారలు అంతా చిరంజీవి ఏర్పాటుచేసిన రీయూనియన్ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. అప్పటి తారలు ఏటా ఏదో ఒక చోట కలిసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి ఈ వేడుకలకు మెగాస్టార్‌ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఈ వేడుకల్లో 80ల నాటి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటులు ఒక చోట కలిసి సందడి చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే, రీ యూనియన్‌లో పాల్గొన్న సినీ తారలంతా కలిసి తీసుకున్న ఫొటో తాజాగా బయటి కొచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి మోహన్‌లాల్ కనిపించారు. నా అమేజింగ్ ఫ్రెండ్ చిరంజీవితో నే...

అనిల్ అంబానీ రాజీనామా వాపస్

చిత్రం
భారతీయ వ్యాపార, ఆర్ధిక రంగాలపై తీవ్ర ప్రభావితం చూపే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓ వైపు లాభాలు ఆర్జిస్తుండగా, మరికొన్ని కంపెనీలు దివాళా అంచున నిలబడ్డాయి. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రతి రంగంలోకి ఎంటర్ అయ్యేలా రిలయన్స్ ను తీర్చి దిద్దాడు ధీరూభాయ్ అంబానీ. ఓ పెట్రల్ బంకులో సాధారణ ఉద్యోగిగా పనిచేసిన అంబానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించేలా కంపెనీని తీర్చి దిద్దాడు. ఇదెలా సాధ్యమైందంటే ఎలా చెప్పగలం. ఇండియన్ మార్కెట్ ను రిలయన్స్ శాసిస్తోంది. తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదిలా ఉండగా ధీరూభాయ్ అంబానీ మృతి చెందాక, అన్నదమ్ములు ఇద్దరు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ విడి పోయారు. ఒకానొక దశలో ఒకరిపై మరొకరు కేసులు వేసుకున్నారు. చివరకు ఒక్కటయ్యారు. ఇదంతా తమను నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన ప్రజలు, వినియోగదారులు, వ్యాపారులను బురిడీ కొట్టించేందుకే ఇది ప్లాన్ చేశారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. తాజాగా ఇండియన్ టెలికం సెక్టార్ లో ఒక ఊపు ఊపుతోంది రిలయన్స్ కంపెనీ. దీనిని అడ్డం  పెట్టుకుని ఆయిల్, దుస్తులు, జవెలరీ, ఫ్యాషన్, షూస్, ట్రెండ్స్, ఇలా ప్రతి ఒక్క రంగానికి విస్తరించింది...

ముమ్మాటికీ మహా అపరాధమే

చిత్రం
ఈ దేశం ఎటు పోతోంది. ప్రతి దానికి భారత రాజ్యాంగాన్ని ఉదాహరణగా చూపించే సాంప్రదాయం ఇవ్వాళ కనుమరుగై పోతోంది. దేశంలో రాజకీయాలు ఎంతగా దిగజారి పోయాయో ఇవ్వాళ కళ్ళ ముందు అగుపిస్తోంది మరాఠా. నిన్న కర్ణాటక నేడు మరాఠా. ప్రజలు ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు. దీనిని సాకుగా తీసుకున్న బీజేపీ పార్టీ తన సిద్ధాంతాలను, రాజకీయ విలువలను పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసింది. చీటికీ మాటికీ హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకు వచ్చే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో వారికే తెలియాలి. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తూ అణగారిన, సామాన్య, అట్టడుగున, గుర్తింపునకు నోచుకోని వర్గాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించాలని సూచించారు. దాని కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు పార్టీలు సులువుగా మారుతున్నారు. విలువలకు తిలోదకాలు ఇస్తూ అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. వీరిని కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే వారికి అనుకూలంగా, తొత్తులుగా వ్యవహరిస్తున్నారు గవర్నర్లు. గతంలో దివంగత ఎన్ఠీఆర్ కు అనుభవంలోకి వచ్చింది. ఈ దేశంలో తాము మాత్రమే పవిత్రులమని, ...

కొలిక్కిరాని మహా సంక్షోభం

చిత్రం
మరాఠా సంక్షోభం అలాగే కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ ధ్వజమెత్తారు. ఓ వైపు మెజారిటీ లేకపోయినా, ఇంకో వైపు తాము సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉన్నామంటూ చెప్పినా పట్టించు కోలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే , కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టులో పిల్ వేశాయి. సెలవు రోజు అయినప్పటికీ సమస్య తీవ్రంగా ఉండడం వల్లనే ధర్మాసనం విచారణకు స్వీకరించింది. స్వల్ప ఊరట లభించడంతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ దూకుడు పెంచారు. బలపరీక్షలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలువరించేందుకు తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. ఎన్సీపీపై తిరుగు బావుటా ఎగరేసిన అజిత్‌ పవార్‌ను వెనక్కి లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అజిత్‌ను బుజ్జ గించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్సీపీ శాసనసభాపక్ష నేత జయంత్‌ పాటిల్‌ను దూతగా ప్రయోగించారు. అజిత్‌తో చర్చలు జరిపి వెనక్కి తీసుకురావాలి పాటిల్‌ను ఆదేశించారు. అజిత్‌తో చర్చలు జరి...