జాక్ పాట్ కొట్టేసిన శ్రీనివాస ఫార్మ్స్

తెలంగాణ రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది . కోళ్ల పరిశ్రమదారులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తూ ఉండడమే కాకుండా మరిన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. దీంతో రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో కొంత వ్యాపారం మందగించిన గత కొంత కాలం నుంచి ఈ పరిశ్రమ గాడిన పడింది . ఇప్పటికే ఎందరో కోళ్లు, గుడ్లు, దాణా , ప్రాసెస్సింగ్ కు సంబంధించిన రంగాలలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు , కంపెనీలు ముందుకు వస్తున్నాయి . ఈ రంగంలో చాలా కంపెనీలు కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తున్నారు . ఇదే రంగంపై ఆధారపడి బతుకుతున్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ప్రతి రోజు వేలాది వాహనాలు కోళ్లు , గుడ్లు, దాణా ను సరఫరా చేస్తున్నాయి. హైదరాబాద్ , మెదక్ , జహీరాబాద్ , కరీం నగర్ , మహబూబ్ నగర్ , జడ్చర్ల , అడ్డాకుల , కొత్తూరు , ఆంగల్ , కడ్తాల్ , ఇలా చాలా ప్రాంతాలలో ఈ పరిశ్రమ జోరుగా సాగుతోంది . బ్యాంక్ లు కూడా వీటి ఏర్పాటు కోసం డబ్బులు రుణాలుగా ఇస్తున్నాయి . ఇవే కాకుండా ఆయా కంపెనీలు కూడా షేర్ బేసిస్ మీద రుణంగా ఇస్తున్నాయి . ఇటీవల రాష్ట్ర సర్కార్ గురుకులాలు, హాస్టల్స్ , కేజీబీవీ స్కూల్స్ ను ఏర్పాటు చేయడంతో ...