ఫాల్కే అవార్డుకు కృష్ణ అర్హుడు

తెలుగు సినీవాలీలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. మెగా స్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు, లేడీ అమితాబ్ విజయశాంతి ఒకే వేదికపై నిలిచిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్, రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాల్ బహదూర్ స్టేడియం లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి నన్ను పిలవగానే ఆశ్చర్యం వేసింది..షాక్ తిన్నాను..ఆనందం వేసింది. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్ ఇంత స్పీడ్‌గా, క్వాలిటీగా సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి ఇంత కంటే ఇంకేం కావాలి..అందరూ ఇలాగే చేయాలి..అప్పుడే ఈ పరిశ్రమ పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఉపాధి ఉంటుంది.. థియేటర్స్ కళకళ లాడుతుంటాయి అని చిరంజీవి అన్నారు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర చేశారు. దిల్ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించారు. అందరి అభిమానుల మధ్య ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి.. ఇదే నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా.. ఈరోజు నిరూపించినందుకు మహేష్ ను అభినందిస...