!..నువ్వు నీలాగే ఉండు..!

నీ దగ్గర ఏముంది. నిన్ను పొగిడే వాళ్లున్నారా. నీ చుట్టూ మందీ మార్బలం ఉందా. నిన్ను ఆకాశానికి ఎత్తేసి. లాబీయింగ్ చేసే వాళ్లున్నారా. ఎదుటి వాళ్లను మెస్మరైజ్ చేసే లౌక్యం ఉందా..పోనీ సాయంత్రం అయితే బార్ లేదా పబ్ కు తీసుకు వెళ్లగలిగే స్టామినా నీకుందా..గ్యాంగ్ ను మెయింటెనెన్స్ నీ వద్దుందా..పోనీ బెదిరించి పనులు చేసుకునే పవర్ వుందా..పర్స్ నిండా కరెన్సీ వుందా..ఆస్తులు, అంతస్తులు..అమెరికాను తలదన్నే కార్లున్నాయా..కళ్లు చెదిరే స్మార్టు ఫోన్లున్నాయా. నీకెంతమంది ఫాలోయర్స్ ఉన్నారా..అయితే ఇప్పుడున్న దునియాలో నువ్వు తోపు. నిన్ను డామినేట్ చేసే వాళ్లుండరు..అంతా అన్నా అని అనేటోళ్లే. ఇంకెందుకు ఆలస్యం. అమెరికా జపం చేయండి చాలు. అబ్బో ఫ్లయిట్లు..దిమ్మ తిరిగే బ్యాంకు బ్యాలెన్సులు నిండితే చాలు కదా. నీకో సర్కార్ కొలువుంటే చాలు..అదే పది వేలు. అదే ధ్యాస..అదే శ్వాస. పక్కోడు ఏమై పోతేనేం. నువ్వు బాగుంటే చాలు. ఇది కాదు జిందగీ అంటే. నీ వద్ద చిల్లి గవ్వ లేక పోయినా..నీ దగ్గర దమ్ముంటే చాలు. దీనిని ఏలటానికి . ఇక నీకు నీవే బ్రాండ్. నీ జీవితం నీది. ఇంకొకడి డామినేషన్ అక్కర్లేదు. నిన్ను...