ఇండియాలో టాప్ స్టార్టప్స్ ఇవే

ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా ఇండియా మారుతోంది. తన స్వరూపాన్ని మార్చేసుకుంటోంది. ఇండియాకు చెందిన ఔత్సాహికులు , ఆంట్రప్రెన్యూర్స్ ఎక్కడలేనంత మంది పుట్టుకొచ్చారు. కొత్త ఆలోచనలకు రెక్కలు తొడుగుతున్నారు. తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూ థాట్స్..నూ లుక్స్..న్యూ డిజైన్స్‌తో తెగ ఆకట్టుకుంటున్నారు. వ్యాపారంలో డబ్బులు ముఖ్యం కాదని..కాస్తంత తెలివి వుంటే చాలు..కాస్తంత నడుం వంచి కష్టపడితే..నాణ్యవంతమైన సర్వీసులు అందజేయగలిగితే కోట్లు వెనకేసుకోవచ్చు. తాము ఎదుగుతూ..తాము బతుకుతూ తమ లాంటి వారికి..తమ తోటి వారికి లైఫ్ ఇవ్వొచ్చు. ఇటీవల యువతీ యువకుల్లో ఒక్కటే కనిపిస్తోంది. తామేమిటో నిరూపించుకునే అవకాశం తాము స్థాపించిన లేదా ప్రారంభించిన దానితోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. ఇంకొకరి దగ్గర పని చేసేందుకు ఇష్టపడటం లేదు. స్వంతంగా ఏదైనా తామే స్టార్ట్ చేయాలని తపిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ట్రైనర్స్‌తో , అనుభవజ్ఞులతో, మెంటార్స్‌తో ఇలా ఆయా రం...