అంతటా ఐపీఎల్ ఫీవర్ - బంతి గెలిచేనా..బ్యాట్ నిలిచేనా - గెలిచేది క్రికెట్టే
లలిత్ మోదీ, జగన్మోహన్ దాల్మియా వీరిద్దరూ లేకపోతే క్రికెట్‌కు ఇంతటి మజా వచ్చి వుండేది కాదేమో. ఒకరేమో భౌతికంగా మన మధ్య లేరు. ఇంకొకరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్నారు. ప్రపంచ క్రికెట్ కౌన్సిల్‌ను శాసిస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క ఇండియానే. ప్రభుత్వాలతో పనిలేదు..పాలకులను కేర్ చేయరు. ఎవరినీ దగ్గరకు రానీయరు..ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై ఉన్న అపవాదు. వీటన్నింటిని పక్కన పెడితే ..ప్రపంచంలోనే అత్యంత సంపన్న వంతమైన దేవాలయాల్లో శ్రీ వేంకటేశ్వరుడు..అలివేలు మంగమ్మ చరిత్ర సృష్టిస్తే..భారీ ఆదాయాన్ని మూటగట్టుకుని ..బిలియన్ డాలర్లను దాటి ట్రిలియన్ డాలర్లను దాటేసిన కథ బీసీసీఐది. కనీసం ఒక్కసారి ఛాన్స్ కోసం ఎందరో పొలిటికల్ స్టార్స్, ఆటగాళ్లు, సెలబ్రెటీలు, బిజినెస్ పర్సనాలిటీస్, టైకూన్స్, వివిధ కంపెనీల దిగ్గజాలు, అధిపతులు పోటీ పడ్డారు. పడుతూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరు దాని పరిధిలోకి వెళ్లలేక పోతున్నారు.
అంతటి దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసేసుకుంది క్రికెట్ బోర్డు. అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దానికి ప్రతి ఏటా ఆడిట్ ఉంటుంది..కానీ ఎంత మ్యాచ్‌లు, టోర్నీల నిర్వహణ వల్ల ఎంత వస్తుందో..ఎంత ఆదాయం సమకూరుతుందో ఇప్పటికీ లెక్కల్లేవు. పొంతనలేని సమాధానాలు చెప్పడం పరిపాటిగా మారింది. ఇందులో బీజేపీ సర్కార్ ఆధిపత్యం వహించాలని పావులు కదిపింది. ప్రతిపక్షాలను నోరు మూయించి..ఒన్ మెన్ షో చేస్తున్న మోడీ ఇంట గెలిచినా..రచ్చ చేసినా..చివరకు బీసీసీఐ వరకు వచ్చేసరికల్లా చేతులెత్తేశారు. 1983లో ప్రపంచకప్‌ను ఇండియా కెప్టెన్ కపిల్‌దేవ్ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు వెస్ట్ండీస్‌ను ఓడించి విజయం సాధించింది. కప్పును ముద్దాడుతూ ..స్టేడియం అంతటా ఆటగాళ్లు కలియ తిరుగుతుంటే భారత జాతి యావత్తు పులకించి పోయింది. ప్రతి ఒక్కరు సగర్వంగా తలెత్తుకుని మేరా భారత్ మహాన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. మువ్వొన్నెల జాతీయ పతాకాలతో దేశమంతటా ప్రదర్శనలు చేశారు. ఇండియన్ క్రికెట్ జట్టుకు ఘనమైన రీతిలో స్వాగతం లభించింది. అప్పటి నుంచి ప్రారంభమైన ఈ క్రికెట్ ఫీవర్ ఇపుడు ప్రతి ఇంట్లోకి చొరబడింది.
టెక్నాలజీ మారింది. తరాలు మారాయి. కాలం వెళ్లుతూనే ఉన్నది. ఒకప్పుడు గిల్లీ దండాగా ఉన్న ఈ ఆట ఇపుడు ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసేస్తోంది. ఇండియా జాతీయ క్రీడ హాకీ. కానీ సీన్ మారింది. ఇండియా అంటేనే క్రికెట్. క్రికెట్ అంటేనే భారత్ . అనే ట్యాగ్ లైన్ సుస్థిరమైన నినాదంగా మారింది. ఒక్కో ఆటగాడు కోట్ల రూపాయలు దాటేశారు. లెక్కలేనంత ఆదాయం. ఊహించని రీతోలో బ్రాండ్ నేమ్. ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన ఆటగాళ్లలో మనోళ్లు కూడా చేరిపోయారు. పూర్తి ఇండిపెండెంట్ మనస్తత్వాన్ని కలిగి ఉన్న క్రికెటర్లు ఎవరి మాట వినడం లేదు. కార్పొరేట్ కంపెనీలు, విదేశీ సంస్థలు వేలాదిగా ..కుప్పలు తెప్పలుగా బీసీసీఐ కార్యాలయం ముందు నిలబడి ఉన్నాయి. తమకు అవకాశం దక్కుతుందా అని. ప్రపంచంలోనే అతి పెద్ద డీల్ గా ఐపీఎల్ -12 ప్రసార హక్కుల కోసం నిర్వహించిన బిడ్డింగ్ రికార్డు సృష్టించింది. స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ శంకర్ 16 వేల కోట్లకు పైగా వేలం పాట పాడి దక్కించుకున్నాడు. వరల్డ్ వైడ్‌గా బిగ్గెస్ట్ డీల్‌గా 2018 సంవత్సరంలో నిలిచి పోయింది. ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఇది ఒక చారిత్రాత్మకమైన ఒప్పందమనే చెప్పక తప్పదు.
ఎందుకింతగా ఆఫర్ చేశారని ఉదయ్ శంకర్ ను ప్రశ్నిస్తే..ఆయన చెప్పిన సమాధానం ..ఇపుడున్న ఆయా కంపెనీల సిఇఓలు తప్పక గుర్తుంచు కోవాలి. పోటీ అన్నది లేక పోతే మజా ఏముంటుంది. ఇపుడు కాక పోయినా రేపు మాదవంతుందున్న నమ్మకం మాకుంది. అందుకే 16 వేల కోట్లు కాదు..వీలైతే 20 వేల కోట్లు వెచ్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మార్కెట్‌లో మాకు తిరుగు లేదు. అలాంటప్పుడు ప్రసార హక్కులు మాకు కాక ఇంకెవ్వరికి దక్కుతాయి అని ఆయన ప్రశ్నించారు. ఎవరిపై వత్తిళ్లు తీసుకు రాలేదు. ఇంకెవ్వరినీ ప్రభావితం చేయలేదు. స్టార్ అంటేనే నక్షత్రం. కానీ ప్రపంచంలో స్టార్ అంటేనే మా సంస్థ గుర్తుకు వస్తుంది. నాణ్యవంతమైన ప్రసారాలు. ఎక్కడా రాజీ పడక పోవడం మా సక్సెస్‌కు గుర్తు. ఇదీ ఉదయ్ శంకర్ చెప్పిన జవాబు. సో..ధోనీ ఆడినా రోహిత్ చెలరేగినా..ఇరు జట్లలో ఏదో ఒక జట్టు గెలుస్తుంది. కాదనలేం. కానీ రియల్‌గా ఆలోచిస్తే క్రికెట్టే నిలుస్తుంది..గెలుస్తుంది. ఇది మాత్రం నిజం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి