మెట్రోకు జైకొట్టిన జనం

హైదరాబాద్ ఐటీ హబ్ గా మారాక నగరవాసులు, యూత్ జోష్ మీదుంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. అంతే కాదు ఎన్ని సీసీ కెమెరాలు అమర్చినా జరిగే దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సిటీ వాసులంతా ఆర్టీసీ కంటే మెట్రో సర్వీసెస్ బెటర్ అంటున్నారు. రికార్డు స్థాయిలో ఇందులోనే జనం జర్నీ చేస్తున్నారు. దీంతో ఎక్కడ లేని ఆదాయాన్ని మూటగట్టుకుంటోంది మెట్రో. కొత్త ఏడాదికి మెట్రో సరికొత్త రికార్డుతో వెల్ కమ్ చెప్పింది. ఈ ఒక్క రోజులోనే దాదాపు 4.60 లక్షల మంది ట్రైన్ జర్నీ చేశారు. ఇప్పటి వరకు ఇదే రికార్డ్. సెలబ్రేషన్స్ నేపథ్యంలో ట్రైన్స్ టైమింగ్ పెంచడం, మద్యం లిమిట్‌గా తాగిన వాళ్లకూ అనుమతి ఇవ్వడం మెట్రోకు కలిసొచ్చింది. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు పొడిగించిన టైమింగ్స్‌తో ఒక్క రోజులో లక్షల మంది మెట్రోజర్నీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ మెట్రోకు ఇది మరో మైలురాయి. గతంలో 4.10 లక్షల నుంచి 4.20 లక్షల మంది వరకు గరిష్ఠంగా ప్రయాణించిన రోజులు ఉన్నాయి. సెలబ్రేషన్స్ సందర్భంగా రైళ్ల టైమింగ్స్‌ను పొడిగించారు. లిమిటెడ్‌గా మద్యం తాగిన వారిని ప్రయాణించేందుకు అనుమతించడంతో నగర వాసులు ఎక్కు...