పిక్చర్స్ హల్ చల్ ..రేణూ వైరల్
రేణూ అంటే ఎవ్వరూ గుర్తు పట్టరు. కానీ రేణూ దేశాయ్ అంటే మాత్రం ఠక్కున గుర్తు పడతారు. ఆమె ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఒకప్పటి సతీమణి. వ్యక్తిగత కారణాల రీత్యా వీరిద్దరూ విడి పోయారు. రేణూ దేశాయ్ భావుకురాలు, ఫోటోగ్రాఫర్, కవయిత్రి కూడా. అంతే కాకుండా ఆమె సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తన అభిప్రాయాలను, రచనలను, ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. దీంతో మోస్ట్ పాపులర్ పర్సన్ గా ఉన్నారు. ఇటీవలే ఆమె కొత్తగా మరో వ్యక్తిని పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ అంశం గూర్చి పవన్ కళ్యాణ్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పవన్ నుంచి విడి పోయాక రేణూ దేశాయ్ పిల్లలతో కలిసి పూణెలో నివాసం ఉంటున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ.. తన పిల్లలకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచు కుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆద్య తన తండ్రి పవన్ కల్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోను రేణూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దానికి ఫాదర్ అండ్ డాటర్, డాటర్స్ లవ్ అని కాప్షన్స్ కూడా జత చేశారు. అద్భుతంగా, చాలా అందంగా పిల్లలు తల్లి దండ్రుల నుంచి పోలికలు పొందుతారు. ఆద్య కొన్నిసార్లు నాలానే కనిపిస్తుంది.. కానీ చాలా సార్లు వాళ్ల నాన్న, నాన్నమ్మకు కాపీలా కనపిస్తోంది. ఆధ్య నా కెమెరాకి ఇష్టమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇటీవల ఓ నెటిజన్ కామెంట్‌పై రేణూదేశాయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే.
ఆద్య, అకీరాలు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి క్రేజీ ఫెలోస్.. వాళిద్దరు నా సొంతం అని పేర్కొన్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ఎంతైనా పవన్ రక్తం కదా అని కామెంట్ చేశాడు. దీంతో రేణూ గట్టి కౌంటర్ ఇచ్చారు. సైన్స్ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అని సమాధానం ఇచ్చారు. కాగా, ఇటీవల కాలంలో పవన్ పేరు అంతగా ప్రస్తావించని రేణూ..ఇప్పుడు ఆయన ఫొటోను షేర్ చేయడం అభిమానుల్లో చర్చకు దారి తీసింది. దీనిపై ఆమె ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది ఫ్యాన్స్ లో .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి