స్వేచ్ఛ కోసం నిరసన గళం
హాంకాంగ్ నిరసనకారులతో అట్టుడికి పోయింది. గత కొంత కాలం నుంచి పెద్ద ఎత్తున చైనాకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు, యువత ఉద్యమిస్తున్నారు. నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులు నూతన సంవత్సరం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గత ఏడు నెలలుగా లక్షలాది హాంకాంగ్ వాసులు ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్నారు. న్యూ ఇయర్ ను పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీలో లక్షలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారు.
వారి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్‌లను ఆందోళనకారులపై ప్రయోగించారు. ప్రతిగా పోలీసులపై పెట్రోల్ బాంబులను ఆందోళనకారులు విసిరారు. వీధుల్లోని చైనా అనుకూల వ్యాపార సముదాయాలను ధ్వంసం చేశారు. కాగా, 100 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమపై చైనా పెత్తనం ఎందుకంటూ ఇక్కడి జనం నిలదీస్తున్నారు. దీని వెనుక అమెరికా కుట్ర ఉందంటూ చైనా ఆరోపిస్తోంది. ఆ మేరకు అనుమానం వ్యక్తం చేస్తోంది కూడా.
ఇదిలా ఉండగా హాంగ్ కాంగ్ సిటీ వరల్డ్ లో పేరొందిన నగరం. వ్యాపార, వాణిజ్య పరంగా ఈ నగరం అన్నిటికీ అనువుగా ఉంటోంది. అయితే ఇక్కడ డెమోక్రసీ లేదని, దాని కోసమే తాము పోరాటం చేస్తున్నామంటూ లక్షలాది మంది ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. తాము న్యాయబద్దంగా కోరుతున్నామని అంటున్నారు. అయితే కొన్నేళ్లుగా ఈ అద్భుత నగరం పై చైనా పట్టు కలిగి ఉన్నది. అక్కడ ఉక్కుపాదం మోపుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు స్వచ్చందంగా తమకు స్వేచ్ఛ కావాలంటూ రంగంలోకి దిగారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రతిజ్ఞ కూడా చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి