గుడ్ న్యూస్ అదుర్స్

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయన తాజాగా నటించి రిలీజ్ చేసిన గుడ్ న్యూస్ సినిమా అనుకోని రీతిలో వసూళ్లను సాధిస్తోంది. అంతే కాదు బంపర్ హిట్ టాక్ ఇప్పటికే ఈ సినిమా పేరు తెచ్చుకుంది. ఇదే సమయంలో సినిమా సక్సెస్ తో చిత్ర యూనిట్, తారాగణం కూడా హ్యాపీగా ఫీలవుతోంది. ఈ సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల ప్రశంసలు పొందుతూ కళ్లు చెదిరే రీతిలో వసూళ్లు రాబడుతోంది. ఒక వైపు పౌరసత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నప్పటికీ.. ఆ ప్రభావం అంతగా గుడ్‌న్యూస్‌ పై లేదని బాక్సాఫీస్‌ లెక్కలు చాటుతున్నాయి. వీక్‌ డేస్‌లో నిలకడగా వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా ఏకంగా 16 కోట్లు వసూలు చేసింది.

దీంతో ఐదు రోజుల్లో ఈ సినిమా వసూళ్లు 100 కోట్లకు చేరుకున్నాయి. కొత్త సంవత్సరంలో సైతం భారీ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఇప్పటికే వంద కోట్లను దాటినా ఈ మూవీ ఇంకెన్ని డబ్బులు రాబడుతుందో చెప్పలేమంటున్నారు సినీ వర్గాలు. అద్భుతమైన కంటెంట్‌, వినూత్నమైన కథనంతో వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టు కుంటోంది. గత శుక్రవారం 17.56 కోట్లు, శనివారం 21.78 కోట్లు, ఆదివారం 25.65 కోట్లు, సోమవారం 13,41 కోట్లు, మంగళవారం 16.20 కోట్లు మొత్తంగా 94.60 కోట్లను ఈ సినిమా కలెక్ట్‌ చేసిందని బాలీవుడ్‌ ట్రెడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. అక్షయ్‌, కరీనా కపూర్‌, దిల్జిత్‌ దోసాన్జ్‌, కియారా అద్వానీ జోడీలుగా ఈ సినిమాలో నటించారు.

కృత్రిమ గర్బధారణ సమయంలో జరిగిన ఓ తప్పిదం వల్ల రెండు జంటలకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నదే కథ. ఇదొక సున్నిత అంశమైనప్పటికీ దర్శకుడు రాజ్‌ మెహతా దాన్ని ఎక్కడా అపహాస్యం చేయకుండా జాగ్రత్త పడుతూ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ చిత్రం స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ‘దబాంగ్‌ 3’ను పక్కకు నెట్టి మరీ గూడ్‌ న్యూస్‌ వసూళ్లు రాబట్టడం.. ట్రెడ్‌ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. కాగా రాబోయే రోజుల్లో ఈ సినిమా బాలీవుడ్ గత సినిమాల కలెక్షన్స్ మించి పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నది వాస్తవం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!