పోస్ట్‌లు

అక్టోబర్ 28, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

దాడులు ఆపం..ఉగ్ర మూకలను వదలం

చిత్రం
పెద్దన్న అమెరికా తన పట్టు విడుపు ధోరణిని మార్చు కోవడం లేదు. ఎప్పటి లాగానే ప్రపంచంలో ఎక్కడ ఉగ్ర మూకలు దాక్కున్నా వారిని వెతికి పట్టుకుని, కాల్చి పారేస్తామని హెచ్చరికలు జారీ చేసింది అగ్ర రాజ్యం. తాజాగా ఎవ్వరిని వదలబోమని స్పష్టం చేసింది. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టు, ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అబు బాకర్‌ అల్‌ బాగ్దాదీని హత మార్చి, ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీ చేశామని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ వెల్లడించారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పక్కా పథకం ప్రకారం వాయువ్య సిరియాలో అమెరికా సైన్యం బాగ్దాదీని మట్టు బెట్టినట్లు పేర్కొన్నారు. మార్క్‌ మాట్లాడుతూ.. పాశవిక దాడులు, హత్యలకు.. నరమేధానికి కారణమైన బాగ్దాదీని హతం చేసే క్రమంలో ఒక్క అమెరికా సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని తెలిపారు. బాగ్దాదీ అంతం తర్వాత కూడా సిరియాలో ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయని..కొన్ని బాహ్య శక్తులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని వెల్లడించారు. సిరియాలో ఐసిస్‌ను ఓడించేందుకు 2014 నుంచి ప్రయత్నించాం. ఇందులో భాగంగా ఐసిస్‌ చర్యలకు అడ్డుకట్ట వేయడంతో అధ్యక్షుడు ట్రంప్‌...

బ్యాడ్మింటన్ లో మెరిసిన మన బిడ్డ

చిత్రం
తెలంగాణ అంటేనే ప్రతి రంగంలో ఓ ఈసడింపు. వాళ్లకు తెలివి ఉండదని, మాట్లాడటం రాదనీ, సంస్కారం అసలే ఉండదని దెప్పి పొడిచిన ఆంధ్ర వాళ్ళు సిగ్గు పడేలా, తల దించు కునేలా మన ప్రాంతానికి చెందిన వారు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అటు చదువులోనూ ఇటు వ్యాపారం లోను, క్రీడా, సినీ రంగాల్లో తమ ప్రతిభ పాటవాలకు మెరుగులు అద్దుతూ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. వారిలో సానియా మీర్జా ఇప్పటికే ప్రపంచ టెన్నిస్ రంగంలో చరిత్ర తిరుగ రాసింది. మోస్ట్ ఫెవరబుల్ ప్లేయర్ గా పేరు తెచ్చుకుంది. ఇక మహమ్మద్ అజహరుద్దీన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే రిస్టీ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మరో తెలంగాణ అమ్మాయి, మన ఆణిముత్యం అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో పతకంతో దూసుకొచ్చింది. 16 ఏళ్ల రూహి రాజు డొమినికన్‌ రిపబ్లిక్‌ దేశంలో జరిగిన సాంటో డొమింగో ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రూహి అన్‌ సీడెడ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగింది. ఫైనల్‌ దాకా అసాధారణ పోరాట పటిమతో ఆకట్టుకుంది. టాప్‌ సీడ్‌ ఫాబియానా సిల్వా  బ్రెజిల్‌ తో జరిగిన టైటిల్‌ పోరులో ఆమె పోరాడి ఓడింది. రూహి...

చెలరేగిన వార్నర్..తలవంచిన లంక

చిత్రం
క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులకు మరిచి పోని గిఫ్ట్ ఇచ్చాడు ఆస్ట్రేలియా హిట్టర్ వార్నర్. ఫాస్టెస్ట్ సెంచరీతో దుమ్ము రేపాడు. లంకేయులకు చుక్కలు చూపించాడు. సొంత గడ్డపై కొత్త సీజన్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. డేవిడ్‌ వార్నర్‌ 10 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ చేశాడు వార్నర్. అంతర్జాతీయ టి20ల్లో తొలి శతకం సాధించాడు. వార్నర్ రాణించడంతో ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్ గెలుపొందింది. 134 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా చూస్తే టి20ల్లో కంగారూలకు ఇదే అతి పెద్ద విజయం. వార్నర్‌కు తోడు కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 36 బంతుల్లో 64 పరుగులు చేశాడు.  వీరిద్దరూ లంకేయులతో ఆటాడుకున్నారు. వీరితో పాటు గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌ 28 బంతుల్లో 62 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. దీంతో 20 ఓవర్లలో ఆసీస్‌ 2 వికెట్లకు 233 పరుగులు సాధించింది. ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో టాప్‌–3 ఆటగాళ్లు ముగ్గురూ అర్ధ సెంచరీ సాధించడం ఇదే మొదటి సారి కావడం విశేషం. అనంతరం టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక జట్టు వార్నర్‌ స్కోరును కూడా చేరలేక చతికిల పడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేయ గలిగి...

దాదా లేకపోతే నేను లేను

చిత్రం
దాదా బిసిసిఐ ప్రెసిడెంట్ అయ్యాక క్రికెటర్స్ నుండి అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్,  మాజీ ఓపెనర్ గా పేరు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ ప్రసంశలతో ముంచెత్తారు. ఇవ్వాళ నేను మీముందు ఉన్నానంటే కారణం గంగూలీనే. దాదా నాలోని టాలెంట్ ను వెన్ను తట్టాడు. మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్న నన్ను ఓపెనర్ గా ఆడమని కోరాడు. దీంతో నా దశ తిరిగింది. వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకున్నా. గంగూలీ చేసిన మేలు నేను జన్మలో మరిచి పోలేనని చెప్పారు సెహ్వాగ్. తాను అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా రాణించడంలో దాదా పాత్ర మరువ లేనిదని పేర్కొన్నాడు. ప్రాక్టీస్‌ సందర్భంలో నీకు ఓపెనర్‌గా ప్రమోషన్‌ ఇద్దామను కుంటున్నా అని గంగూలీ నా వద్దకు వచ్చి చెప్పాడు. దానికి నువ్వే ఓపెనర్‌గా ఆడొచ్చుగా అని బదులిచ్చా. ప్రస్తుతం ఓపెనర్‌ స్థానం ఖాళీగా ఉంది. అందుకే మొదట ఓ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నీకు ఓపెనర్‌గా ఆడే అవకాశం ఇస్తా. ఒకవేళ ఓపెనర్‌గా ఫెయిలైనా మిడిల్ఆ ర్డర్‌లో నీ స్థానానికి ఢోకా ఉండదని దాదా చెప్పాడు అని సెహ్వాగ్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో ఓపెనర్‌ అవకాశం ఇవ్వడం వల్లే తాను రాణించానని, తరువాతి 12 ఏళ్లు ఇక వెను దిరిగి...

పగలు రాత్రి టెస్టుకు రెడీ

చిత్రం
బిసిసిఐ ప్రెసిడెంట్ గా బెంగాలీ దాదా, మాజీ సారధి సౌరబ్ గంగూలీ కొలువు తీరాక పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల పాలక మండలి పూర్తిగా బాధ్యతలు చేపట్టింది. వెంటనే సెలెక్షన్ కమిటీ కూడా బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టీ - 20 తో పాటు టెస్ట్ టీమ్స్ ను ప్రకటించింది. డే అండ్‌ నైట్‌ టెస్టుల నిర్వహణపై చాలా కాలంగా తన ఆసక్తిని ప్రదర్శించిన సౌరవ్‌ గంగూలీ ఇప్పుడు బోర్డు అధ్యక్ష హోదాలో దానికి కార్య రూపం ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. పగ్గాలు చేపట్టిన తర్వాత పలు మార్లు గులాబీ బంతితో టెస్టు నిర్వహణ గురించి సౌరవ్‌ కామెంట్స్ చేశాడు. ఈ విషయంపై బీసీసీఐ అధికారిక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో భారత్‌ ఆడే రెండో టెస్టును డే అండ్‌ నైట్‌గా నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. తన సొంత మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతుందని నిర్దారించారు దాదా. మీ అభిప్రాయం చెప్పాలంటూ బంగ్లాదేశ్‌ బోర్డును కోరాడు. నవంబర్‌ 22 నుంచి 26 వరకు ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరగనుంది. బంగ్లాదేశ్‌ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌తో మాట్లాడాను. వాళ్లు దాదాపుగా అంగీకరించారు. అయితే తమ ఆటగాళ్లతో మాట్లాడాల్సి ఉందని నాతో చెప్పార...

అభిమానుల్లో టెన్షన్ టెన్షన్

చిత్రం
తెలుగు బుల్లి తెర మీద టాప్ రేంజ్ లో దూసు కెలుతున్న రియాల్టీ షో బిగ్ బాస్ లో, అంతిమ విజేత ఎవ్వరనే దానిపై ఫ్యాన్స్ టెన్షన్ తట్టు కోలేక పోతున్నారు. పార్టిసిపెంట్స్ మాత్రం ఇప్పటి వరకు తెగ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం సినీ నటులకు ఉన్నంత క్రేజ్ వీరికి ఉంటోంది. స్టార్ టీవీ మాటీవీని కొనుగోలు చేశాక దాని స్వరూపమే మారి పోయింది. డిఫ్ఫరెంట్ ప్రోగ్రామ్స్, సీరియల్స్ తో తన టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉండగా దేశ మంతటా పాపులర్ అయిన కార్యక్రమంగా బిగ్ బాస్ నిలిచింది. అంతకు ముందు స్టార్ టీవీ కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో చేసిన రియాల్టీ షో దుమ్ము రేపింది. స్టార్ టీవీకి భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. ఒక గదిలో సెలబ్రెటీలు ఉంచితే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఏమేం మాట్లాడుకుంటారో తెలిసేలా చేసే కార్యక్రమానికి ప్లాన్ చేసింది. అది బిగ్ బాస్ గా సక్సెస్ అయ్యింది. దీనిని రీజినల్ స్టేట్స్ లోకి తీసుకు వచ్చింది స్టార్ టీవీ. తాజగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్ అయిన స్టార్ టీవీ మాటీవీలో టెలికాస్ట్ చేసింది. మొదటి సారిగా నటుడు జూనియర్ ఎన్ఠీఆర్ హోస్ట్ చేయగా, రెండోసారి మరో నటుడు నాని హోస్ట్ చేశారు. మూడో ...

ఆశాజనకంగా ఐసీఐసీఐ

చిత్రం
దేశంలో ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్న ఐసీఐసీఐ మార్కెట్ వర్గాల అంచనాలను దాటుకుని లాభాల బాట పట్టింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందజేస్తూ ముందుకు దూసుకు వెలుతోంది. ఇతర ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా దూసుకెళుతోంది. రుణాలు ఇవ్వడం లోను, ఏఫ్డీలు, కరెంట్ ఖాతాలు, ఇతర వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా ఐసీఐసీఐ కొంత వెసలుబాటు కల్పించింది. దీంతో లాభాలు ఆశాజనకంగా మారాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 6 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో 1,205 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 1,131 కోట్లకు చేరిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం 31,915 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో  37,425 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండ్‌ అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ2లో 909 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 28 శాతం తగ్గి  655 కోట్లకు తగ్గిందని, ఆదాయం మాత్రం 18,262 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో  22,760 కోట్లకు పెరిగిందని తెలిపింది. 3,712 కోట్ల పన్ను వ్యయాల కారణంగా లాభం తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం  6,417 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో...

అంతులేని అభిమానం..దీపికా అంటే చచ్చేంత ఇష్టం

చిత్రం
బాలీవుడ్ లోని హీరోయిన్లలో టాప్ నటీమణిగా దీపికా పదుకొనే కొనసాగుతూ వస్తోంది. సినిమాలే కాకుండా టైమ్ కుదిరితే వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తోంది. ఆమె మిగతా హీరోయిన్స్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. ఇన్‌స్ట్రాగామ్‌ లో దీపికాకే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. తాజాగా దీపికకు ఏకంగా 4 కోట్ల మంది ఫాలో చేస్తుండడం తో ఇన్‌స్ట్రాగామ్‌ యాజమాన్యం ఆమెకు భారీ మొత్తంలో ఫీజు చెల్లిస్తోంది. ఇది కూడా ఓ రికార్డ్. ఇక దీపికాకు తెలుగు సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని ఇటీవలే హైదరాబాద్ కు వచ్చినప్పుడు వెల్లడించింది కూడా. అయితే ప్రిన్స్ మహేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని, అతడితో నటించాలని ఉందంటూ స్పష్టం చేసింది. తన వ్యక్తిగత, వృత్తి జీవిత విషయాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పంచుకొనే ఈ బాజీరావ్‌ ‘మస్తానీ’ అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. ఇదే వరుసలో 4.5 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ప్రియాంకా చోప్రా బాలీవుడ్‌లో అందరి కంటే ముందుంది. మరో నటి శ్రద్ధాకపూర్‌ను 3.5 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇక భారత ప్రధాని మోదీ ఇటీవల 3 కోట్ల మార్కుకు చేరు కోవడం గమనార్హం.1986 జనవరి 5 న పుట్టిన ద...

సమ్మెను ఆపం..ప్రభుత్వంతో యుద్ధం

చిత్రం
ఆర్టీసీ సంస్థ తెలంగాణ ప్రజలది. ముమ్మాటికీ కార్మికుల చెమట చుక్కలతో కాపాడుకుంటూ వచ్చింది. ఈ రాష్ట్రానికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా జనాన్ని తప్పు దోవ పట్టిస్తూ జనాన్ని అయోమయానికి గురి చేస్తున్నాడు. దీనిని ప్రజలు గమనిస్తున్నారు. గౌరవ హైకోర్టు సమస్యను వెంటనే పరిష్కరించమని చెప్పినా పట్టించు కోలేదు. అసలు వాస్తవం ఏమిటో ధర్మాసనంకు సైతం అర్థమైంది. అందుకే చీవాట్లు పెట్టింది. సంస్థకు పూర్తి స్థాయిలో మేనేజింగ్ డైరెక్టర్ ను అప్పాయింట్ చేయకుండా నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన ప్రభుత్వం ఈరోజు వరకు అసలు ఏం జరుగుతుందోనన్న వాస్తవాన్ని కోర్టుకు సమర్పించలేదు. ఇక్కడే ప్రభుత్వానికి కార్మికుల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో కన్వీనర్ రాజి రెడ్డి అన్నారు. తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారించే దాకా తమ సమ్మెను ఆపే ప్రసక్తి లేదని చెప్పారు. తమకు ధర్మాసనం పట్ల గౌరవం ఉన్నదన్నారు. ఓ వైపు కార్మికులు చని పోతుంటే ఈ రోజు వరకు సర్కారుకు చీమ కుట్టి నట్లు కూడా లేదన్నారు. చేసిన పనికి డబ్బులు పెట్టుకుని వేతనాలు ఇవ్వకుండా, ఉద్దేశ పూర్వకంగా...

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆగ్రహం..ఆందోళన ఉధృతం..జేఏసీ అల్టిమేటం

చిత్రం
తెలంగాణాలో బస్సులు ఇబ్బడి ముబ్బడిగా తిరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. 90 శాతం నడిపిస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. రోజుకు ఆదాయం వచ్చి ఉంటుంది. మీ దగ్గర కార్మికులకు చెల్లించాల్సిన 49 కోట్లు లేవంటున్నారు. మరి వసూలైన డబ్బుల మాటేమిటి..అసలు ప్రభుత్వం ఇనీకెందుకున్నట్లు అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చలు జరపాలన్న సోయి సర్కారుకు లేనట్టుంది. ఓ వైపు ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మీరు ఈరోజు వరకు పూర్తి వివరాలు సమర్పించలేదు. అసలు ఏజీ ఎక్కడున్నారో తక్షణమే రమ్మనమని ఆదేశాలు జారీ చేసింది. అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలు తాము వినదల్చు లేదని స్పష్టం చేసింది. ఒక సమయంలో కోర్టు  సీరియస్ అయ్యింది. సమ్మెపై హైకోర్టు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై హైకోర్టు నిలదీసింది. జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన 1475 కోట్లు, ప్రభుత్వ సబ్సిడీ కింద రావాల్సిన 1492 కోట్లతో పాటు ప్రభుత్వం నుంచి 2,300 కోట్ల చెల్లింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా కొంత సమయం ...