చెలరేగిన వార్నర్..తలవంచిన లంక
క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులకు మరిచి పోని గిఫ్ట్ ఇచ్చాడు ఆస్ట్రేలియా హిట్టర్ వార్నర్. ఫాస్టెస్ట్ సెంచరీతో దుమ్ము రేపాడు. లంకేయులకు చుక్కలు చూపించాడు. సొంత గడ్డపై కొత్త సీజన్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. డేవిడ్ వార్నర్ 10 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ చేశాడు వార్నర్. అంతర్జాతీయ టి20ల్లో తొలి శతకం సాధించాడు. వార్నర్ రాణించడంతో ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్ గెలుపొందింది. 134 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా చూస్తే టి20ల్లో కంగారూలకు ఇదే అతి పెద్ద విజయం. వార్నర్‌కు తోడు కెప్టెన్ ఆరోన్ ఫించ్ 36 బంతుల్లో 64 పరుగులు చేశాడు.
వీరిద్దరూ లంకేయులతో ఆటాడుకున్నారు. వీరితో పాటు గ్లెన్ మ్యాక్స్ వెల్ 28 బంతుల్లో 62 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. దీంతో 20 ఓవర్లలో ఆసీస్ 2 వికెట్లకు 233 పరుగులు సాధించింది. ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో టాప్–3 ఆటగాళ్లు ముగ్గురూ అర్ధ సెంచరీ సాధించడం ఇదే మొదటి సారి కావడం విశేషం. అనంతరం టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక జట్టు వార్నర్ స్కోరును కూడా చేరలేక చతికిల పడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేయ గలిగింది.
షనక ఒక్కడే లంక జట్టులో రాంసించాడు. అతడు చేసింది. కేవలం 17 పరుగులు మాత్రమే. వీరిలో ఇదే టాప్ స్కోరు. జంపా 3 వికెట్లు పడగొట్టగా, స్టార్క్, కమిన్స్ చెరో 2 వికెట్లు తీశారు. ఇక లంక జట్టులో పేసర్ కసున్ రజిత 4 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చాడు. ఇదే హయ్యెస్ట్ స్కోర్ కావడం గమనార్హం. టి20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రజిత కొత్త రికార్డును నెలకొల్పాడు. అంతకు ముందు 70 పరుగుల స్కోర్ ను దాటేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి