దుమ్ము రేపుతున్న షియోమి..బిజినెస్‌లో టాప్ ..!

ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసి ..జనాన్ని పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ..గుండెల్లో గుబులు రేపుతూ..లోకాన్ని ఏకం చేసిన ఒకే ఒక్క వస్తువు ఏదైనా ఉందంటే..అది రాకెట్ కాదు..అణుబాంబు కాదు..మిస్సైల్స్ కావు..బుల్లెట్స్ ..ఆయుధాలు కావు..అదేమిటంటే స్మార్ట్ ఫోన్. అదొక్కటి మన చేతిలో వుంటే చాలు..ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే క్షణంలో మన చేతుల్లో ఉంటోంది. ఈ క్రెడిట్ అంతా ఐటీ రంగానిదేనని చెప్పుకోవాల్సి ఉంటుంది. రోజుకో కొత్త ప్రాడక్ట్ ఆకర్షిస్తోంది. న్యూ డిజైన్స్..డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాయి మొబైల్స్. వీటిలో ఎన్నో కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న మొబైల్స్‌లలో యాపిల్ కంపెనీవే. తర్వాత శాంసంగ్, ఒన్ ప్లస్, తదితర కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్ గతంలో డామినేట్ చేశాయి. ఆ తర్వాత మార్కెట్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. లోకల్ మేడ్ మొబైల్స్‌కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. తక్కువ ధరలు..ఎక్కువ ఫీచర్స్ వుండే వాటికే ఇండియన్స్ మొగ్గు చూపడంతో అన్ని కంపెనీలు వాటి మార్కెట్ పెంచుకునేందుకు నానా తంటాలు పడ్డాయి. తప్పని పరిస్థిత...