పోస్ట్‌లు

అక్టోబర్ 15, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

దాదా రాక..బీసీసీఐలో కాకా

చిత్రం
బీసీసీఐకి ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ సారథి, బెంగాల్ టైగర్, దాదాగా పేరున్న సౌరబ్ గంగూలీ  ఖాయం కావడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో కాకా మొదలైంది. ఇప్పటికే డేరింగ్, డాషింగ్ ప్లేయర్ గా సౌరబ్ కు పేరుంది. బీసీసీఐలో కోట్లాది రూపాయలు కొలువు తీరి ఉన్నాయి. ఇదే సమయంలో బాధ్యతలు చేపట్టక ముందే గంగూలీ తన ఆపరేషన్ ను స్టార్ట్ చేశాడు. గంగూలీ రావడంతో టీమిండియా జట్టు కోచ్ రవిశాస్త్రి పునరాలోచనలో పడ్డాడు. వీరిద్దరి మధ్య మాటలు లేవు. ఇదిలా ఉండగా తాజాగా గంగూలీ ఇండియన్ సారధి కోహ్లీతో పాటు జట్టు సభ్యుల ఆట తీరుపై ఘాటుగా కామెంట్స్ చేశాడు. కోహ్లి కెప్టెన్సీలో మన జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోందని కొనియాడాడు. అయితే, కీలకమైన ఐసీసీ టోర్నమెంట్లలో చివరి దశలో ఓటమి చవి చూస్తున్నారని, దీనిని అధిగమించడంపై దృష్టి పెట్టాలని సూచించాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా నాకౌట్‌లోనే వెను దిరిగిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో కోహ్లి సేన ఓటమి పాలైంది. అయితే, గంగూలీ ఈ విషయాన్ని నొక్కి చెప్పనప్పటికీ ఐసీసీ టోర్నీలో కడ వరకు నిలిచి విజేతగా నిలవాలని ఆకాక్షించాడు. ...

టెలికాం రంగంలో 5జీ సంచలనం

చిత్రం
ఇప్పటికే టెలికాం రంగాన్ని 4 జీ సేవలు షేక్ చేస్తుండగా దానిని అధిగమిస్తూ 5జీ సేవలు రాబోతున్నాయి. ఇప్పటికే ఫైబర్ నెట్ వర్క్ ఇండియా అంతటా విస్తరించింది. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వాటా కలిగిన దేశంగా ఇండియాకు పేరున్నది. దాదాపు 130 కోట్ల మంది జనాభా కలిగి వుంటే, ఇందులో 118 కోట్ల మంది ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ ఎన్ఎల్ తో పాటు  ప్రైవేట్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్ టెల్ , టాటా, వోడా ఫోన్ , తదితర కంపెనీలలో కనెక్షన్ కలిగి ఉన్నారు. ఇటీవలే రిలయన్స్  గ్రూప్ కంపెనీకి చెందిన జియో ఇండియాలో టాప్ పొజిషన్ లో కి చేరుకుంది. భారీ ఆఫర్స్, అపరిమిత డేటా ఇవ్వడంతో ఒక్క సారిగా 34 కోట్ల మంది జియోలో చేరారు. కనెక్టివిటీ, డేటా, కాల్స్ చేసుకునే సదుపాయం ఉండడంతో దీని వైపు మొగ్గారు. మరో వైపు మొదటి స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ కిందకు దిగజారింది. ఇదిలా ఉండగా 4 జీ సేవల స్థానంలో మరింత వేగంగా నెట్ కనెక్టివిటీ ఉండేందుకు టెలికాం కంపెనీలు వరల్డ్ వైడ్ గా 5జీ  సేవలు అందించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఆ మేరకు భారత ప్రభుత్వం ఇందు కోసం ఏకంగా బిడ్డింగ్ చేపట్టింది. అయితే ఈ బిడ్డింగ్ లో ధర భారీగా సర్కార్ పెంచిందని ఎయిర్ టెల...

నెట్ ఫ్లిక్స్ ఎండీగా స్వాతి మోహన్

చిత్రం
వీడియో స్ట్రీమింగ్ లో వరల్డ్ వైడ్ గా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న మరో దిగ్గజ కంపెనీ నెట్ ఫ్లిక్స్ కంపెనీ లో మన ఇండియాకు చెందిన స్వాతి మోహన్ కు అరుదైన అవకాశం లభించింది. మీడియా రంగంలో .. మార్కెటింగ్ విభాగంలో అద్భుతమైన రీతిలో అనుభవం గడించిన ఈ ఇండియన్ అమ్మాయి స్వాతి మోహన్ తాజాగా అమెరికా దిగ్గజ కంపెనీగా పేరున్న నెట్ ఫ్లిక్స్ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ గా ఎంపికైంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ కంపెనీ యాజమాన్యం స్వాతి మోహన్ ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. స్వాతి మోహన్ అంతకు ముందు నేషనల్ జియోగ్రాఫిక్ అండ్ ఫాక్స్ నెట్ వర్క్స్ గ్రూప్ ఇండియా కంట్రీ హెడ్ గా పని చేశారు. ఆ కంపెనీలో స్వాతి భాద్యతలు చేపట్టాకా భారీ ఆదాయాన్ని తీసుకు వచ్చారు. దీంతో నెట్ ఫ్లిక్స్ ఆమె పనితీరు నచ్చి బిగ్ ఆఫర్ ప్రకటించింది. ఇక నెట్ ఫ్లిక్స్ వీడియో స్ట్రీమింగ్ ప్లేట్ ఫామ్ మీద పనిచేస్తోంది. ప్రారంభించిన కొద్దీ కాలంలోనే మిగతా అమెజాన్, గూగుల్ , తదితర కంపెనీల సరసన చేరింది. డిజిటల్ మీడియాలో నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు ఓ సంచలనం. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కు కోట్లాది మంది వ్యూవర్స్ ఉన్నారు. దీని వెనుక స్వాతి మోహన్ కృషి ఉన్నది. సదరు కం...

చార్జీల మోత..జనానికి వాత

చిత్రం
తిండి లేకపోయినా బతుకొచ్చు కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా, వాడకుండా ఉండలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో దైనందిన జీవితంలో భాగమై పోయింది. మొత్తం మీద తప్పనిసరి కావడంతో టెలికాం కంపెనీలు వినియోగదారులతో ఆటలాడుకుంటోంది. వీటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం టెలికం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా - ట్రాయ్ ను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ కంపెనీలు మాత్రం ఆఫర్లతో ఆకట్టు కోవడం, తర్వాత సబ్ స్క్రైబర్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించిన రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ కు చెందిన జియో ఊహించని రీతిలో దెబ్బ కొట్టింది. దీంతో తెలియకుండానే చార్జీలు వడ్డించేందుకు రంగం సిద్ధం చేసింది. మొదట అంతా ఫ్రీ అంటూ జనాన్ని బురిడీ కొట్టించి గణనీయమైన ఆదాయాన్ని పొందుతోంది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై రిలయన్స్‌ జియో చార్జీలు అమలు చేస్తోంది. దీంతో మిగతా టెలికం సంస్థలు కూడా చార్జీల పెంచే పనిలో పడ్డాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కు కోవడం కష్టమేనంటూ తాజాగా భారతీ ఎయిర్‌టెల్‌ వ్యాఖ్యానించింది. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో  గోపాల్‌ విఠల్‌ ...

అందనంత దూరంలో షావోమి

చిత్రం
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్స్ మొబైల్స్ కంపెనీ దిగ్గజ మొబైల్స్ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అమ్మకాలలో అందనంత దూరంలో దూసుకు పోతోంది. దీంతో ఏం చేయాలో దిగ్గజ కంపెనీలు పాలుపోక తల్లడిల్లుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ వాటా కలిగిన ఇండియా మొబైల్స్ మార్కెట్ లో తమ వాటా పెంపొందించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కొనుగోలుదారులు, మొబైల్స్ ప్రేమికులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఎక్కువ ఫీచర్స్, ధరల్లో సామాన్యులు, మిడిల్ క్లాస్ పీపుల్స్ అందుకోలేంతగా ఉండడంతో యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్ మొబైల్స్ జోలికి వెళ్లడం లేదు. ఇదే సమయంలో ఇటీవలే షావోమి కంపెనీ చైర్మన్ ఇండియాలో పర్యటించారు. అంతే కాకుండా షావోమి అమ్మకాల్లో స్మార్ట్ ఫోన్స్ తో పాటు మిగతా ప్రోడక్ట్స్, యాక్సరీస్ 10 మిలియన్స్ కు పైగా అమ్ముడు పోయాయి. దీంతో దిగ్గజ కంపెనీలు షావోమి కొట్టిన దెబ్బకు అబ్బా అంటున్నాయి. షావోమి కంపెనీ చరిత్రలో ఇదో అద్భుత రికార్డ్. ఇదిలా ఉండగా షావోమి కంపెనీ ఇండియా హెడ్ గా మను కుమార్ జైన్ భాధ్యతలు చేపట్టాకా, సదరు కంపెనీ స్వరూపమే పూర్తిగా మారి పోయింది. షావోమిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చాడు. అంతే కాదు ...

దంగల్ వైరల్..జిన్ పింగ్ మెచ్చిన మూవీ

చిత్రం
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా భారతీయ సినిమా రంగంలో చరిత్ర సృష్టించింది. కలెక్షన్లలో సునామీ సృష్టించింది. సినిమా విడుదలై ఏళ్ళు గడిచినా ఇంకా ఆ మూవీ ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. దంగల్ పేరు మరోసారి దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇదే సినిమా గురించి సాక్షాత్తు భారత దేశపు ప్రధాన మంత్రి నరేంద్ర దాస్ మోదీ హర్యానా ఎన్నికల ప్రచారం సందర్బంగా ప్రస్తావించారు. డ్రాగన్ చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ ప్రత్యేకంగా దంగల్ సినిమాను చూశారని చెప్పారు. ఆ సినిమా తనకెంతగానో నచ్చిందని అన్నారని మోదీ తెలిపారు.  మహిళలు ఏదైనా సాధించగలరని సినిమాలో బాగా చూపారని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారన్నారు. జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు మోదీ. కాగా కుస్తీ యోధులు బబిత, గీతలను ఆయన తండ్రి మహావీర్‌ సింగ్‌ ఫొగట్‌ ప్రపంచ స్థాయి రెజ్లర్లుగా తీర్చి దిద్దే క్రమాన్ని దంగల్‌ సినిమాలో చిత్రీకరించారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ మహావీర్‌ సింగ్‌ పాత్రలో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. చర్ఖిదాద్రి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున బబిత ఫొగాట్‌ పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గ...

ధ్యానం జీవన యోగం

చిత్రం
జీవితం ఓ ప్రయాణం సాగనీ తీయగా అన్న సినీ కవి రాసిన పాటను విన్నప్పుడల్లా మనసు తేలికవుతుంది. హృదయం మరింత ఆనందపు వాకిళ్ళల్లో తచ్చట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు చూస్తే కాలం మెలమెల్లగా సాగుతున్నట్టు, ఏం చేయాలో తోచేది కాదు. కానీ గత పదేళ్లుగా చూస్తే మాత్రం, ఈ ప్రపంచం మిస్సైల్ ను మించి పోయింది. ఎంతలా అంటే మనల్ని మనం గుర్తు పట్టలేనంతగా. బతకడం అంటేనే జస్ట్ తిన్నామా..పడుకున్నామా...తెల్లారిందా ..అనేలా మారి పోయింది ప్రస్తుత కాలం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దెబ్బకు ఎంతో ధృడమైన, బలమైన మానవ సంబంధాలు రాను రాను పలుచనై పోయాయి. దీంతో గతంలో ఇల్లు ఓ పొదరిల్లులా ఉండేది. అదో పూలవనాన్ని తలపింప చేసేది. ఇల్లంతా చుట్టలతో, చుట్టు పక్కల వాళ్ళ పలకరింపులతో నిండి పోయేది. పూర్తిగా సందడిని తలపింప చేసేది. ఏ చిన్న కార్యం జరిగినా లేదా పండుగ వచ్చినా ఇల్లంతా నిండి పోయేది. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా సాగుతోంది. ప్రపంచంలో చావడం చాలా ఈజీగా మారిపోగా బతకడం మాత్రం నిత్యం నరకాన్ని చూపిస్తోంది. దీంతో బంధాలు పూర్తిగా ప్లాస్టిక్ నవ్వులతో, పలకరింపులకే పరిమితమై పోయాయి. జస్ట్ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కదా అందులోనే హాయ్, బ...

ఈగోలు పక్కన పెట్టండి..సమ్మె పరిష్కరించండి - హైకోర్టు

చిత్రం
ఆర్టీసీ సమ్మెకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ వైపు కార్మికులు..మరో వైపు ప్రభుత్వం ఎవరికి వారే మంకుపట్టు వీడడం లేదు. దీని వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ ..చర్చలు జరపాలి. ఓ వైపు పిల్లలలు చదువుకు దూరమవుతున్నారు. ఈగోలు పక్కన పెట్టండి జనాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించండి. ఈ సందర్బంగా ఇరు వర్గాల తరపున కోర్టులో న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ధర్మాసనం ఓ సమయంలో ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ను సమ్మె జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియ చేయండి  అని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించాలి. సమ్మె పరిష్కారానికి సంబంధించిన డ్రాఫ్ట్ అందజేయాలని ఆదేశించింది. ఆర్టీసీ ఉద్యోగులు పరాయి వారు కాదు..వాళ్ళు మీ సంస్థలో ఉద్యోగులే. మరి వారితో చర్చలు జరిపితే తప్పేముందంటూ నిలదీసింది. ఇదే సమయంలో కార్మికులు సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. సమ్మె తర్వాత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రశ్నించింద...

పబ్లిసిటీ వద్దు సాయమే ముద్దు

చిత్రం
తెలుగు సినిమా రంగంలో ఎందరో హీరోలు. కోట్లాది రూపాయలున్నా సమస్యల్లో ఉన్నప్పుడు స్పందించడం చాలా అరుదు. కొంత మంది మాత్రమే తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు ఓ చిన్నారికి గుండె శస్త్ర చికిత్స కోసం అవసరమయ్యే ఖర్చు భరిస్తానని చెప్పారు. అంతకు ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు ఊర్లను దత్తత తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు తమ మానవతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వర్ధమాన నటుడు సాయి ధరమ్ తేజ్ ఒక అడుగు ముందుకేసి తన పుట్టిన రోజున ఫ్యాన్స్ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయొద్దని కోరారు. అంతే కాకుండా డబ్బులు లేక మధ్యలోనే ఆగి పోయిన వృద్ధాశ్రమానికి తాను చేయూత ఇవ్వాలని డిసైడ్ అయ్యానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకుండా మంచి పనుల కోసం ఉపయోగించాలని పిలుపునిచ్చారు. మధ్యలో ఆగి పోయిన వృద్ధాశ్రమం పూర్తి చేయడంతో పాటు ఏడాది కాలానికి సరిపడా నిర్వహణ ఖర్చు, వసతులను ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ సందర్బంగా ఓ వీడియోను అభిమానుల కోసం విడుదల చేశారు. నా పుట్టిన రోజున అన్నదానాలు, రక్తదాన శిబిరాలు చేస్తున్నారు. మీకు అభినందనలు. అయితే నేనో నిర్ణయం తీసుకున్నా. అదేమిటంటే ఇప్ప...

ఆర్టీసీకి నష్టం .. మెట్రోకు లాభం

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె దెబ్బకు ప్రయాణీకులు లబోదిబోమంటున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు, క్యాబ్స్ డ్రైవర్స్ తమ ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో జనం కస్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ జర్నీ చేసేందుకే సరిపోతున్నాయి. బహిరంగంగా నిలువు దోపిడీకి పాల్పడుతున్నా సంబంధిత రవాణా శాఖాధికారులు పట్టించు కోవడం లేదు. సమ్మె ప్రభావంతో ప్రభుత్వం ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో అది అమలు కావడం లేదు. వాహనదారుల అడ్డగోలు వసూళ్ల దందాగా దర్జాగా సాగుతోంది. ఇదిలా ఉండగా సమ్మె కారణంగా ఆర్టీసీకి రోజుకు కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం దిగనంటోంది. కార్మికులు మాత్రం సై అంటూ సమ్మె సైరన్ మోగిస్తున్నారు. మరో వైపు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి అయిదు నిమిషాలకు మెట్రో ట్రైన్స్ నడపాలని సర్కార్ మెట్రో రైల్ అధికారులను ఆదేశించింది. దీంతో భారీ ఆదాయం సమకూరుతోంది. గ్రేటర్‌ వాసుల కలల మెట్రో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 3.80 లక్షల మంది ప్రయాణికులతో తాజా రికార్డును బద్దలు కొట్టింది. ఇటీవల ...