ఫైనాన్షియల్ రంగంలో దివ్య సంచలనం..!

నిన్నటి దాకా ప్రపంచం వైపు మనం చూస్తే..ఇపుడు లోకమంతా భారతదేశం వైపు చూస్తోంది. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఆధ్యాత్మిక , వ్యాపార తదితర రంగాలలో ఇండియన్స్ తమ సత్తా చూపిస్తున్నారు. అంతులేని విజ్ఞానాన్ని స్వంతం చేసుకుని..అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. సమాజాన్ని శాసిస్తున్న ఐటీ రంగంలో మనోళ్లే టాప్. టాప్ టెన్ దిగ్గజ సంస్థలలో కీలకమైన పదవుల్లో, విభాగాల్లో ఇండియన్సే బాధ్యతలు నిర్వహించడం మన వారి క్రియేటివిటికీ అద్దం పడుతోంది. తమిళనాడకు చెందిన సుందర్ పిచ్చయ్ గూగుల్ సిఇఓగా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. పురుషులతో ధీటుగా మహిళలు తమ శక్తి సామర్థ్యాలకు పదును పెడుతూ ప్రపంచపు ప్రతిభావంతుల సరసన నిలబడుతున్నారు. జగమెరిగిన ఫోర్బ్స్ వెల్లడించిన ప్రభావశీలుర జాబితాలో మనోళ్లు కూడా చోటు దక్కించుకుంటున్నారు. ఇదంతా కొన్నేళ్లుగా భారతీయులు తమను తాము నిరూపించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థలు , ఐటీ దిగ్గజాలు ఇండియా వైపు అడుగులు వేస్తున్నాయి. టాలెంట్‌తో పాటు కమిట్‌మెంట్ కలిగిన వీరి వైపే మొగ్గు చూపుతున్నా...