రిలీజ్ కాకుండానే రికార్డులు బ్రేక్

తన స్టార్ డమ్‌ను కోల్పోకుండా బ్యాలెన్స్‌గా మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్న అతికొద్దిమంది నటుల్లో తెలుగు సినిమా రంగంలో ప్రిన్స్ మహేష్ బాబు ఒక్కరే. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కోలివుడ్, టాలీవుడ్ , తమిళనాడు సినిమా పరిశ్రమలలో మహేష్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో భారీగా ప్రిన్స్ సినిమాలకు డిమాండ్ ఉంటోంది. స్టార్ డమ్‌తో పాటు లో ప్రొఫైల్ మెయింటెనెన్స్ చేయడం ఆయనకే చెల్లింది. పూజా హెగ్డే ప్రధాన హీరోయిన్‌గా నటిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన మహర్షి టీజర్‌కు ఊహించని రీతిలో రేటింగ్ లభించింది. కేవలం 24 గంటల్లో కోటి మందికి పైగా ఈ టీజర్ ను వీక్షించారు. ఇది మహేష్ కు ఉన్న స్టామినా ఏమిటో తెలుస్తుంది. ఈ మూవీ పట్ల రోజు రోజుకు వ్యూవర్‌షిప్ పెరుగుతూ వస్తోంది. మహర్షి సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ సినిమా మార్కెట్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ప...