ప్రతిపక్ష హోదా దక్కని వైనం - ప్రమాదంలో పార్టీ భవితవ్యం

వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 17వ సార్వత్రిక ఎన్నికలు శాపంగా మారాయి. కనీసం ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేక పూర్తిగా చతికిల పడి పోయింది. దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించిన ఆ పార్టీ ఇపుడు తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితిని కొని తెచ్చుకుంది. త్యాగాలు, బలిదానాలు చేసుకున్న గాంధీ కుటుంబం ఇవాళ పునరాలోచనలో పడింది. మోదీ వ్యూహాలను ఎదుర్కోలేని స్థితిలోకి రావడం బాధాకరం. గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి దాకా బలమైన కేడర్ కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు బేల చూపులు చూస్తోంది. కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు సైతం అదే బాట పట్టాయి. 2014లో మోదీ మామూలుగా ఎంటర్ అయ్యాడు. తాను ఛాయ్‌వాలా నంటూ..ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటూ వేడుకున్నాడు. ఆ తర్వాత ఏకు మేకయ్యాడు. ఏకశ్చత్రాధిపత్యం దిశగా దేశాన్ని అన్నీ తానై నడిపించాడు. ప్రతిపక్షాల నోళ్లు మూయించాడు. ఎన్నో ప్రతికూలతల మధ్య బీజేపీకి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చాడు. ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూనే తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. సోషల్ మీడియాను వాడుకున్నాడు. వ్యక్తిగత విమర్శలక...