జనంలోనే జనసేన..!
రాజకీయాలు వేరు..సినిమా రంగం వేరు. రెండు భిన్నమైన రంగాలు. పార్టీని నడపాలంటే చాలా వ్యూహాలు పన్నాల్సి ఉంటుంది. ఎందరినో భరించల్సి వస్తుంది. చాలా ఓపిక కావాలి. జనాన్ని మెస్మరైజ్ చేసి .అరచేతిలో వైకుంఠం చూపించే స్థాయికి చేరుకోవాలి. అప్పుడు కాని పవర్‌లోకి వచ్చే పరిస్థితి కనిపించదు. తెలుగుసినిమా రంగంలో పవన్ కళ్యాణ్ ఓ వెపన్. ఏపీ పాలిటిక్స్‌లో ప్రత్యక్షంగా రంగంలోకి దిగాడు. జనసేన పార్టీని స్థాపించి దానికి దిశా నిర్దేశనం చేశారు. అన్నీ తానై దగ్గరుండి నడిపించారు. ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి 138 సీట్లలో జనసేన అభ్యర్థ/లఉ బరిలో ఉన్నారు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థ/ల చేతుల్లో అపజయం చవి చూశారు.
ఆయనను ఆరాధించే అభిమానులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. పవన్ కళ్యాన్ ఓడిపోవడం తమను బాధ కలిగించిందన్నారు. అసెంబ్లీలో 175 సీట్లు ఉంటే ఒకే ఒక్క సీటును గెలుచుకోగలిగింది జనసేన. ఒక్క రాజోలులోనే ఈ విజయం దక్కింది. ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు కేటాయించింది. ఇపుడు అది పూర్తగా పగిలి పోయింది. 25 ఏళ్ల పాటు రాజకీయ ప్రస్థానం కోసమే నేను ఇక్కడికి వచ్చా. నేను పోటీ చేసిన రెండు స్తానాల్లో నన్ను ఓడించినా ..పార్టీ అభ్యర్థులు ఓడి పోయినా తుది శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని పవన్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటానని అన్నారు. విజయం సాధించిన జగన్, మోదీలకు అభినందనలు తెలిపారు. 138 స్థానాల్లో జనసేన, సీపీఐ , సీపీఎం , బీఎస్పీ లు కలిసి 35 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేశారు.
ఒక్కటి తప్పా అన్నీ పోగొట్టుకున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించు కోలేక పోయారు. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం 15 నుంచి 25 స్థానాలు దాకా రావచ్చని అంచనా వేశారు. ఒక్క సీటుతో సర్దు కోవాల్సిన పరిస్థితి జనసేనకు ఏర్పడింది. 2014లో పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారు. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మద్ధతు పలికారు. అనంతరం ఆయన పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేదు. పార్టీ ఏర్పాటయ్యాక ఐదేళ్ల పాటు సమయం ఉన్నా నియోజకవర్గాల వారీగా, మండలాలు, గ్రామాల వరకు కమిటీలను ఏర్పాటు చేయలేదు. జిల్లాల కమిటీలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేదు. జనసేనకు ఓటు వేస్తే ..అది వేరే పార్టీకి పోతుందన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయలేదు.
ఏక వ్యక్తి పాలనను మరిపించింది. మాజీ స్పీకర్‌తో పాటు మరో ఇద్దరు మాత్రమే కనిపించారు. జనసేన టీడీపీకి బి టీం అన్నంతగా ప్రచారం జరిగింది. అది కూడా కొంప ముంచింది. నిర్దుష్టమైన ప్రణాళిక లేక పోవడం, కార్యక్రమాలు చేపట్టక పోవడం, విధానాలు లేక పోవడం జనసేనకు సీట్లు రాకుండా చేశాయి. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ 18 స్థానాల్లో గెలుపొందింది. ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపివేశారు చిరంజీవి. తాజాగా జనసేన ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తం మీద ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టాలి. పార్టీని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయగలిగితే ఎంతో కొంత ప్రభావం చూపే వీలుంది.
.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి