టీఅర్ఎస్ కే జీ హుజూర్..కాంగ్రెస్ కు షాక్

నువ్వా నేనా అన్న రీతిలో సాగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ తన సీటును కోల్పోయింది. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఎన్నిక కాంగ్రెస్, టీఅర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 43 వేలకు పై చిలుకు మెజారిటీతో గులాబీ అభ్యర్థి శైనంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా హుజూర్‌నగర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. దీంతో గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన్‌లో సంబరాలు జరిగాయి. తెలంగాణ అంతా హుజూర్ నగర్ వైపు చూసింది. ప్రజాస్వామ్యానికి, కేసీఆర్ నిరంకుశత్వానికి జరిగిన పోటీగా ఈ ఉప ఎన్నికను చూపించే ప్రయత్నం చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరోసారి గెలుపు ఖాయమన్న ధీమాతో ఉత్తమ్..తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడి పోయిన సైదిరెడ్డిని మరోసారి టీఆర్‌ఎస్ బరిలోకి దింపింది. బీజేపీ, టీడీపీ పార్టీలు బరిలో నిలిచినా..పెద్దగా ప్రభావం చూప...