విజిల్ మహిళల కోసం


తమిళ్ సినిమా రంగంలో కేవలం మూడే మూడు సినిమాలు మాత్రమే తీసిన అట్లి అంటే, అక్కడ ఎక్కడ లేనంతటి క్రేజ్. కథ రాసు కోవడం, దానిని జనరంజకం చేయడం, పబ్లిక్ పల్స్ పట్టు కోవడం అట్లికి వెన్నతో పెట్టిన విద్య. ప్రతి సినిమా సమాజాన్ని, జనాన్ని దృష్టిలో పెట్టుకుని తీశాడు. ఇంకేం బాక్సులు బద్దలయ్యాయి. కోట్లు కురిశాయి. దీంతో ఒక్క రోజులోనే స్టార్ డైరెక్టర్ల సరసన అట్లి చేరి పోయాడు. ఇటీవల నటి ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాజాగా మహిళా నేపథ్యం కలిగిన కథాంశంతో విజిల్ అనే పేరుతో సినిమా తీశాడు. అది దేశమంతటా దీపావళి పండుగ రోజున రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూరయ్యాయి. దీనిని 187 కోట్లు పెట్టి తీశాడు. ట్రైలర్ దుమ్ము రేపింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమా మొత్తంలో ప్రముఖ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించాడు. తన ఇమేజ్ మరింత పెంచేలా అట్లి విజయ్ ను వాడుకున్నాడు. అంతే కాకుండా విజిల్ యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. రిలీజ్ చేసిన కొద్దీ సేపట్లో కోట్లాది మంది దానిని వీక్షించారు. ఇప్పటికే ఇది కూడా ఓ రికార్డ్ గా నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా సామాజిక బాధ్యతగా అట్లి అసాధారణమైన డిసిషన్ తీసుకున్నాడు. అదేమిటంటే విజిల్ తెలుగులో, తమిళ్ లో బిగిల్ గా వస్తున్న ఈ సినిమాను మహిళలకు అంకితం ఇస్తున్నట్లు డైరెక్టర్ అట్లి వెల్లడించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు `విజిల్‌` అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు.

తెలుగులో 700 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. మ‌హిళ‌ల ఫుట్‌బాల్ క్రీడా నేప‌థ్యంలో సినిమా సాగుతుంది. అస‌లు `విజిల్‌` క‌థ‌ను రాయడానికి ప్ర‌స్తుతం స‌మాజంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడులే కార‌ణ‌మ‌ని అట్లీ వెల్లడించారు. మ‌హిళ‌ల‌పై జరుగుతున్న అఘాయిత్యాల‌ను చూసి బాధ‌తో `విజిల్‌` క‌థ‌ను రాసుకున్నాన‌ని అట్లీ తెలిపారు. మ‌హిళా ప్ర‌ధానంగా సాగే సినిమాలో విజ‌య్‌ లాంటి సూప‌ర్‌ స్టార్ న‌టించ‌డం చాలా ఆనందంగా అనిపించింద‌ని చెప్పిన అట్లీ..`విజిల్‌` సినిమాను మ‌హిళ‌ల‌కు అంకితం ఇస్తున్న‌ట్లు చెప్పారు. అట్లి కి హ్యాట్స్ ఆఫ్ చెబుదామా.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!