మీటూ సంచలనం..సినీ లోకం కల్లోలం

దేశ వ్యాప్తంగా మీటూ కలకలం రేపుతోంది. ఈ జాడ్యం ప్రతి చోటా చాప కింద నీరులా విస్తరించింది. అన్ని రంగాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. అయితే ఎక్కువగా గ్లామర్ రంగం సినీ రంగాన్ని షేక్ చేస్తోంది. పేరుతో పాటు లక్షలాది రూపాయలు వస్తుండడంతో పలువురు సినీ పరిశ్రమపై మోజు పెంచుకుంటున్నారు. వీరి బలహీనతలను ఆసరాగా చేసుకుని డైరెక్టర్స్, నిర్మాతలు, హీరోలు, కెమెరామెన్లు, ఇతర టెక్నీషియన్స్ హీరోయిన్లు, ఇతర నటులపై లైంగిక వేధింపులకు పాలపడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వేలాది మంది బాధితులు ఉన్నప్పటికీ తమకు జరిగిన దారుణాల గురించి నోరు మెదపడం లేదు. ఎందుకంటే అవకాశాలు రావనే భయంతో లోలోపట భరిస్తున్నారు. తాజాగా కొందరు ధైర్యం చేసి పేరున్న రచయితలు, దర్శకులు, ఇతరులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిలో ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద, లక్ష్మి శరత్ కుమార్, తదితరులు ఉన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ఇదిలా ఉండగా తాజగా సక్సెస్ ఫుల్ చిత్రాలతో దూసుకెళుతున్న నటి తమన్నా మీటూ పై కామెంట్స్ చేసింది. మీటూతో అవకాశాలు బంద్ అని నటి తమన్నా పేర్కొంది. మీటూ అనేది ముందుగా హాలీవుడ్‌లో మొదలై, ఆ తరువాత మన దేశంలో వ్యాపించింది....