దైవం దారుణం..భక్తులకు శఠగోపం..కల్కినా మజాకా
ఈ దేశంలో మోడీ కొలువు తీరాక బాబాలు, స్వాముల హవా ఎక్కువై పోయింది. మరో వైపు ఐటీ శాఖ అధికారులు ఎప్పుడు ఎక్కడ వాలి పోతారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఎక్కడ చూసినా ఆశ్రమాలు, నేరాలు, ఘోరాలు, కోట్లాది ఆస్తులు, నోట్ల కట్టలు పోగేసుకునున్నారు. తరాలకు సరిపడా సమకూర్చుకుంటున్నారు. మనుషుల బలహీనతలే వీరికి లాభంగా మారి పోయాయి. తమకు అతీంద్ర శక్తులున్నాయని, తాము దైవాంశ సంభూతులం అంటూ జనాన్ని మెస్మరైజ్ చేస్తూ పబ్బం గడుపుతున్నారు. సత్యసాయి బాబా, బాల సాయి బాబా ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది మంది బురిడీ బాబాలు, స్వామీజీలు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలను నిట్టనిలువునా ముంచుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఐటీ జరిపిన దాడుల్లో తమను తాము దేవుళ్లమంటూ మోసానికి పాల్పడిన కల్కి భగవాన్ కు చెందిన కల్కి ఆశ్రమాలపై దేశవ్యాప్తంగా ఏక కాలంలో రెండు రోజులుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఊహించని రీతిలో దాదాపు 500 కోట్లకు పైగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. వీరి కరెన్సీని చూసి ఐటీ అధికారులకు దిమ్మ తిరిగి పోయింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ కీలక ప్రకటన చేసింది. వెల్‌నెస్ కోర్సుల పేరుతో ఆస్తులు కూడగడుతున్న కల్కి ఆశ్రమం, కార్యాలయాల్లో మూడు రోజులుగా సాగుతున్న ఇన్‌కం టాక్స్ తనిఖీల్లో 500 కోట్లకు పైగా వెల్లడించని ఆస్తులు వెలుగు చూశాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ‘ఏకత్వం’ అనే తత్వంతో కల్గి భగవాన్ స్థాపించిన ట్రస్టు వెల్‌నెస్ కోర్సుల పేరిట తత్వశాస్త్రం, ఆధ్యాత్మికం తదితర అంశాల్లో శిక్షణ కార్యక్రమాల పేరుతో ఏపీలోని వరదయ్యపాలెం, చెన్నై, బెంగళూరు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. 2014–15 నుంచి లెక్క చూపని ఇలాంటి నగదు 409 కోట్లుగా ఉన్నట్లు ఐటీ విభాగం ప్రాథమికంగా అంచనా వేసింది. 43.90 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకుంది.
ఇవి కాకుండా విదేశీ కరెన్సీని కూడా సీజ్ చేసింది. దీని విలువ 18 కోట్లు. 26 కోట్ల విలువ చేసే 88 కిలోల బంగారం, 5 కోట్ల విలువ గల 1,271 క్యారెట్ల వజ్రాలను కూడా సీజ్ చేసింది. వీటి విలువ సుమారు 93 కోట్లు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి అని పేర్కొంది. కాగా విజయకుమార్ అలియాస్ కల్కి తాను విష్ణుమూర్తి 11వ అవతారమని ప్రజలను నమ్మించి వేల కోట్లకు అధిపతి అయ్యారు. ఆయన స్వగ్రామం తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాతం. 1949 మే 7న జన్మించారు.1977లో పద్మావతి అనే మహిళను పెళ్లి చేసుకున్న ఆయన 35 ఏళ్ల వయసులో కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పంలో ‘జీవాశ్రమం’ పేరుతో గుర్తింపు లేని పాఠశాల ఏర్పాటు చేశారు. ఆశించినంత ఆదాయం రాక పోవడంతో 1991లో దానిని మూసేశారు. ఆ తరువాత ఆ బడిని ‘సత్యలోకం’గా మార్చి కల్కి అవతారం ఎత్తారు. తన భార్య అమ్మ భగవాన్ అని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో ఐదెకరాల పొలం కొని కల్కి ఆశ్రమాన్ని స్థాపించారు. తనతో పాటు తన భార్య దర్శనానికీ ధరలు నిర్ణయించారు. కేవలం పాదం మాత్రం చూడాలనుకునే వారు వెయ్యి, పాద పూజ చేయాలంటే 5 వేలు, మాట్లాడాలంటే 25 వేలు, ఆశ్రమంలోనే రెండు రోజుల దీక్ష చేయాలంటే 50 వేలు వసూలు చేయటం ప్రారంభించారు. కొన్నాళ్లకు ‘మూలమంత్రం’ అంటూ ఒక మంత్రాన్ని సృష్టించి దాన్ని లాకెట్‌లో ఉంచి, దానిని భారతీయులకు 50 వేలు, విదేశీయులకు లక్ష చొప్పున విక్రయించటం ప్రారంభించారు. 2008లో వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో 300 కోట్లతో ‘గోల్డె¯న్ టెంపుల్’ నిర్మించారు. ఆ తరువాత వివిధ రాష్ట్రాల్లో ఆశ్రమాలు, కార్యాలయాలు ప్రారంభించారు. కల్కితోపాటు ఆయన కుమారుడు కృష్ణా జీపైనా అనేక ఆరోపణలు, వివాదాలు ఉన్నాయి. కల్కిలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. కొందరు నామ రూపాలు లేకుండా పోయారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి