మీటూ సంచలనం..సినీ లోకం కల్లోలం
దేశ వ్యాప్తంగా మీటూ కలకలం రేపుతోంది. ఈ జాడ్యం ప్రతి చోటా చాప కింద నీరులా విస్తరించింది. అన్ని రంగాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. అయితే ఎక్కువగా గ్లామర్ రంగం సినీ రంగాన్ని షేక్ చేస్తోంది. పేరుతో పాటు లక్షలాది రూపాయలు వస్తుండడంతో పలువురు సినీ పరిశ్రమపై మోజు పెంచుకుంటున్నారు. వీరి బలహీనతలను ఆసరాగా చేసుకుని డైరెక్టర్స్, నిర్మాతలు, హీరోలు, కెమెరామెన్లు, ఇతర టెక్నీషియన్స్ హీరోయిన్లు, ఇతర నటులపై లైంగిక వేధింపులకు పాలపడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వేలాది మంది బాధితులు ఉన్నప్పటికీ తమకు జరిగిన దారుణాల గురించి నోరు మెదపడం లేదు. ఎందుకంటే అవకాశాలు రావనే భయంతో లోలోపట భరిస్తున్నారు. తాజాగా కొందరు ధైర్యం చేసి పేరున్న రచయితలు, దర్శకులు, ఇతరులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
వీరిలో ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద, లక్ష్మి శరత్ కుమార్, తదితరులు ఉన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ఇదిలా ఉండగా తాజగా సక్సెస్ ఫుల్ చిత్రాలతో దూసుకెళుతున్న నటి తమన్నా మీటూ పై కామెంట్స్ చేసింది. మీటూతో అవకాశాలు బంద్ అని నటి తమన్నా పేర్కొంది. మీటూ అనేది ముందుగా హాలీవుడ్‌లో మొదలై, ఆ తరువాత మన దేశంలో వ్యాపించింది. అదీ బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించి ఆపై దక్షిణాదిలో కలకలానికి దారి తీసింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో మీటూ చాలా ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి. ఈ వ్యవహారం సద్దు మణిగిందనుకుంటున్న సమయంలో నటి తమన్నా మూలంగా మరోసారి చర్చకు వచ్చింది.జోరు మీదున్న తమన్నా మీటు పై స్పందించింది. సహజ సిద్ధంగా పని చేసుకుంటూ పోయే తనకు ఇంత వరకూ మీటూ సమస్య ఎదురు కాలేదని చెప్పింది.
తాను ఎలా ప్రవర్తించాలో తనకు తెలుసు అని అంది. లైంగిక పరమైన ఒత్తిడి రాకపోవడం తన అదృష్టం కూడా కావచ్చునని పేర్కొంది. అత్యాచార ఒత్తిళ్లు ఎదుర్కొన్న మహిళలు వాటి గురించి ధైర్యంగా మాట్లాడడం మంచిదేనంది. అలాంటి వారికి అవకాశాలు రాక పోవడం బాధగా ఉందని పేర్కొంది. ఏదైనా ఒక విషయం మిమ్మల్ని బాధిస్తోందని భావిస్తే దాన్ని ఎదిరించి పోరాడాలని పిలుపు ఇచ్చింది. అలా తాను కూర్చుని చింతించే అమ్మాయిని కాదని చెప్పింది.ఇంతకాలం నటిగా నిలబడడానికి కారణం తాను అనుకున్నది చేయగలగడమేనని చెప్పింది. ఎఫ్ 2 , సైరా సినిమాలు తమన్నాకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేశాయి. దీంతో తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి