శారదా పీఠం .. భక్తికి ప్రతిరూపం - స్వరూపానందేంద్ర ప్రస్థానం

అన్ని దారులు అటు వైపు వెళుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన వారు..లబ్ధ ప్రతిష్టులైన వారి అడుగులన్నీ ఆ పవిత్రమైన ..భక్తులకు సాంత్వన చేకూర్చుతోంది విశాఖపట్టణంలోని పెందుర్తిలో శారదా పీఠం. ఆధ్యాత్మికతకు..యాగాలకు చిరునామా ఈ పుణ్య స్థలం. ఇక్కడ కొలువై వున్న అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడతారు. సాక్షాత్తు భక్తి స్వరూపుడైన పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీని అనుసరిస్తారు. ఆయన బోధనలను ..ధర్మబద్ధమైన ఆధ్యాత్మిక , ధార్మిక విలువలను ఆలకిస్తారు. అవలోకన చేసుకుంటారు. భక్తికి..సామాజిక బాధ్యతకు మధ్యన కుటుంబమనే బంధాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఎందరో ఆధ్యాత్మిక వేత్తలు, స్వాములు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలుపంటూ ఎరుగక కష్టపడుతున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ధర్మబద్ధంగా వుండాలని, పదుగురికి చేయూతనివ్వాలని..ఆపద సమయంలో వున్నప్పుడు ఆదుకోవాలని..కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న వారికి ఆసరాగా నిలవాలని పీఠాలు, ఆశ్రమాలు, అధిపతులు, పీఠాధిపతులు పిలుపునిస్తున్నారు. విలువైన జీవితాన్ని గుర్తెరిగారు కాబాట్టే వారు రుషుల...