పంతం నెగ్గించుకున్న దుష్యంత్

ఊహించని రీతిలో కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వానికి కోలుకోలేని రీతిలో ప్రజలు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పనితీరుకు మాహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండంగా ప్రకటించాయి విపక్ష పార్టీలు. బీజేపీకి ఊహించని రివర్స్ గిఫ్ట్ ఇచ్చారు ఓటర్లు. పూర్తి మెజారిటీ వస్తుందని నమ్మకంతో ఉన్న మోదీ, అమిత్ షా లకు మిశ్రమ ఫలితాలు రావడం పునరాలోచనలో పడేశాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఇతర పార్టీలపై ఆధారపడి పవర్ లోకి వచ్చేలా చివరకు అమిత్ షా పావులు కదిపారు. హంగ్ ఫలితాల అనంతరం హరియాణాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. జన్‌నాయక్ జనతా పార్టీ తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ మొగ్గు చూపడంతో పదవుల పంపిణీలోనూ దాదాపు స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ కొన సాగనుండగా, జేజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. ఫలితాల్లో అసెంబ్లీ లోని 90 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలను ఏ పార్టీ సాధించ లేక పోయింది. బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లు గెల్చాయి. ప్రజా తీర్పును జేజేపీ గౌరవించడం లేదంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శల...